మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేశారా..అయితే కొనుగోలు సమయంలో మీకు షాపు ఓనర్ కాని అలాగే మొబైల్ అమ్మిన సంస్థ గాని మీ ఫోన్ 8 గంటలు ఛార్జింగ్ పెట్టి ఆ తరువాత దాన్ని వాడమని చెబుతుంది. అయితే అలా నిజంగా 8 గంటలు ఛార్జింగ్ పెట్టి వాడాలా..ఛార్జింగ్ పెట్టకుండా వాడితే ఏమవుతుంది. ఇలాంటి విషయాలపై ఓ లుక్కేయండి
జియో జోరు తగ్గిందంటున్న ట్రాయ్..
కొత్తగా తయారైన బ్యాటరీ..
కొత్తగా తయారైన బ్యాటరీ చాలా చోట్ల మారి చివరగా మీ చేతుల్లోకి వచ్చి చేరుతుంది. ఎక్కడో తయారై మొబైల్ కంపెనీకి చేరుతుంది. అక్కడ అసెంబుల్ అయిన తరువాత అది మొబైల్‌తో ప్యాక్ అవుతుంది.
ఈ క్రమంలో బ్యాటరీలో ఛార్జింగ్..
ఇలా ప్యాక్ అయిన తరువాత కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ కు, అక్కడి నుంచి షోరూమ్ కు, అక్కడి నుంచి మన చేతిలోకి వస్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోయి ఉంటుంది.
కొత్త ఫోన్‌ను ఆన్ చేయగానే..
మరొక కారణం ఏంటంటే కొత్త ఫోన్‌ను ఆన్ చేయగానే ఫార్మ్ వేర్ వంటివి, ఫోన్లో ఉన్న అప్లికేషన్లకు అప్‌డేట్స్ వచ్చి ఉంటాయి. అవి ఇన్‌స్టాల్ చేయాలంటే ఫోన్ లో సరిపడా బ్యాటరీ పర్సెంటేజ్ ఉండాలి.
కొంచెం బ్యాటరీ ఛార్జింగ్‌తో ఇన్‌స్టాల్ చేస్తే..
అలా కాకుండా కొంచెం బ్యాటరీ ఛార్జింగ్‌తో ఇన్‌స్టాల్ చేస్తే మధ్యలోనే ఛార్జింగ్ అయిపోయి రకరకాల సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. అందుకే కనీసం ఎనిమిది గంటలపాటు ఛార్జింగ్ పెట్టాలని ఫోన్ కంపెనీలు చెబుతుంటాయి.
Li-ion బ్యాటరీ ఫోన్లు..
ముఖ్యంగా Li-ion బ్యాటరీ ఫోన్లు ఉపయోగించే వారు తప్పనిసరిగా ఛార్జింగ్ పెట్టి వాడాలని నిపుణులు చెబుతున్నారు. అవి మీ చేతికొచ్చే సరికి ఛార్జింగ్ డెడ్ అయి వస్తాయని వారంటున్నారు.
కొత్త ఫోన్లు ఛార్జింగ్ పెట్టగానే ..
ఈ రోజుల్లో కొత్త ఫోన్లు ఛార్జింగ్ పెట్టగానే పేలిపోయిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాంటి సమయంలో మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు ఈ సమస్యలను అధిగమించాలంటే బ్యాటరీ పుల్ అయ్యేదాకా వేచి చూడటం మంచిది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్‌డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.