లీ 1ఎస్.. నెంబర్ వన్!

By Sivanjaneyulu
|

భారత్ మొబైల్ మార్కెట్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల ప్రవాహం ముంచెత్తుతోంది. ముఖ్యంగా రూ.12,000 రేంజ్‌లలో డజన్ల కొద్ది ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. మార్కెట్లో ఇంత పోటీ ఎదురవుతున్నప్పటికి లీఇకో ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ 'లీ1ఎస్' తన సత్తాను చాటుతూ అమ్మకాలు సునామీలను సృష్టిస్తోంది.

లీ 1ఎస్.. నెంబర్ వన్!

స్టన్నింగ్ డిజైనింగ్, బెస్ట్ క్లాస్ టెక్నాలజీ ఇంకా శక్తివంతమైన ఫీచర్లు లీ1ఎస్ ఫోన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న లీ1ఎస్ ఫోన్ నిర్మాణంలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినయమ్‌ను ఉపయోగించారు. స్ర్కూలెస్ ఇండస్ట్రియల్ డిజైన్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 8.65 మిల్లీ మీటర్ల మందంతో వస్తోన్న రెడ్మీ నోట్ 3తో పోలిస్తే లీ1ఎస్ స్మార్ట్‌ఫోన్ 7.5 మిల్లీ మీటర్ల మందంతో 13శాతం స్లిమ్‌గా ఉంటుంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

Read More : గూగుల్ చావును జయించబోతోందా...?

లీ 1ఎస్.. నెంబర్ వన్!

లీ 1ఎస్.. నెంబర్ వన్!

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి లీ1ఎస్ ఫోన్ లో ఆక్టా కోర్ 2.2గిగాహెర్ట్జ్ సీపీయూ వ్యవస్థను ఏర్పాటు చేసారు. షియోమీ రెడ్మీ నోట్3లో పొందుపరిచిన హెక్సా కోర్ 1.8గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌కు ఇది పోటీగా నిలుస్తుంది. యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ పోర్ట్ లీ1ఎస్ ఫోన్ కు మరో ప్రధాన ఆకర్షణ. లీ1ఎస్ బ్యాటరీని 5 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 3.5 గంటల టాక్ టైమ్‌ లభిస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ చార్జింగ్ కోసం పరితపించే బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఈ సదుపాయం మరింతగా ఉపయోగపడుతుంది.

లీ 1ఎస్.. నెంబర్ వన్!

లీ 1ఎస్.. నెంబర్ వన్!

లీ1ఎస్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ గ్లాస్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఫోన్ ను ప్రమాదాల బారి నుంచి కాపాడగలదు. 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ లీ1ఎస్ ఫోన్‌లోని మరో ప్రత్యేకత. ఈ ఫీచర్ రెడ్మీ నోట్ 3లో లోపించటం విశేషం. 3జీబి ర్యామ్‌‍తో వస్తోన్న లీ1ఎస్ ఫోన్ లో గేమింగ్ ఇంకా మల్టీటాస్కింగ్ అదరహో అనిపిస్తుంది.

లీ 1ఎస్.. నెంబర్ వన్!

లీ 1ఎస్.. నెంబర్ వన్!

రూ.10,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న లీ1ఎస్ ఫోన్, ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

లీ 1ఎస్.. నెంబర్ వన్!

లీ 1ఎస్.. నెంబర్ వన్!

లీ1ఎస్ ఫోన్ చైనా మార్కెట్లో టాప్ సెల్లర్‌గా నిలవటం విశేషం. అక్కడి మార్కెట్లో గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ ఫోన్ లు కేవలం రెండు నెలల వ్యవధిలో 2 మిలియన్ యూనిట్లు అమ్ముడవటం విశేషం. వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాపత్ంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Why Le Eco’s flagship killer Le 1s is a first among equals: Facts v/s Hype. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X