జియోఫోన్ రూ.1000 నష్టం వెనుక ఉచిత దోపిడి, అంబాని వ్యాపార తెలివి ఇదే !
జియో ఫోన్ తయారీకి అయిన ఖర్చు రూ. 2500. అయితే రూ. 1500కి ఎందుకు ఇస్తోంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేసిన జియో అధినేత ఇండియాకా స్మార్ట్‌ఫోన్ అంటూ జియో ఫీచర్ ఫోన్ ని యూజర్లకు అందించారు. అయితే ఆ ఫోన్ ఉచితమంటూ ప్రకటిస్తూనే కొన్నొ మెళికలు పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఆ ఫోన్ రూ. 1000 నష్టంతో యూజర్లకు అందిస్తున్నామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరి నష్టం వెనుక వచ్చే లాభం ఏమిటీ అనేదే ఇప్పుడు టెక్ వర్గాలను కలవరపెడుతోంది.

జియోఫోన్ పై ఇప్పుడు అనేక విమర్శలు
వినియోగదారుల చేతుల్లోకి వచ్చిన జియోఫోన్ పై ఇప్పుడు అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. జియో పెట్టిన షరతులతో కష్టమర్లు భగ్గుమంటున్నారు. ఉచితం అంటూనే దోపిడికి తెరలేపారని మార్కెట్ వర్గాలు కలవరపడుతున్నాయి.

అసెంబుల్ ఖర్చు సుమారు రూ. 2,500
అయితే మరో కొత్త న్యూస్ ఇప్పుడు జియో ఫోన్‌పై బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ ఫోన్ అసెంబుల్ ఖర్చు సుమారు 2,500 రూపాయలైనట్టు సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.

మూడేళ్ల తర్వాత కంపెనీ రీఫండ్
కానీ ఈ అసెంబుల్ ఖర్చు కంటే వెయ్యి రూపాయలు తక్కువగా అంటే రూ.1,500కే జియో ఫోన్‌ను రిలయన్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత కంపెనీ రీఫండ్ చేయబోతుంది.

కేవలం రూ.1,500కే ఎందుకు..?
అయితే ఖర్చు పరంగా రూ.2,500కు విక్రయించాల్సిన ఈ ఫోన్‌ను కేవలం రూ.1,500కే ఎందుకు విక్రయిస్తుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి
మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్లను ఆకట్టుకుని, తన పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి ధరను తగ్గించి అమ్ముతున్నట్టు ఈ విషయం తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. ధర తగ్గించి అమ్మడం వల్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవచ్చని జియో చూస్తుందని తెలిసింది.

వచ్చే రెండేళ్లలో
వచ్చే రెండేళ్లలో కంపెనీ తన సబ్‌స్క్రైబర్ల బేస్‌ను 250 మిలియన్ నుంచి రూ.300 మిలియన్ యూజర్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నాయి. అంతేకాక స్మార్ట్‌ఫోన్‌కు వెచ్చించలేని 500 మిలియన్ల మంది ప్రేక్షకులను ఇది టార్గెట్‌గా పెట్టుకుంది.

average revenue per user
దేశీయ ఫీచర్ ఫోన్ యూజర్లతో వినియోగదారు సగటు ఆదాయం( ARPU) 50 రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉందని మెజార్జీ విశ్లేషకులు అంచనావేశారు. జియో ప్రస్తుతం తీసుకొచ్చిన ఫోన్ నెలవారీ రూ.153 ప్లాన్‌తో ఈ ARPU (average revenue per user) ను పెంచుకోనుందని తెలిసింది.

ఇప్పుడు షరతులను ప్రకటించడంపై
జియో ఫోన్ తీసుకునే సమయంలో షరతులను ప్రకటించకుండా ఇప్పుడు షరతులను ప్రకటించడంపై కూడా యూజర్లు మండిపడుతున్నారు. ఇదేంటని నిలదీస్తున్నారు.

రిలయన్స్ ఇంకా స్పందించలేదు
అయితే ఈ విషయంపై రిలయన్స్ ఇంకా స్పందించలేదు. అధికారికంగా స్పందిస్తే తప్ప దీనిపై వాస్తవాలు ఏంటనేది రహస్యంగానే ఉంటాయి.


Click it and Unblock the Notifications