సరికొత్త అనుభూతిని అందిస్తున్న వన్‌ప్లస్ వాల్‌పేపర్లు

|

చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ తమ ఉత్పత్తులతో కస్టమర్లలో ఎప్పుడూ నిరాశ కలిగించలేదు. ఎప్పుడూ తమ ఉత్పత్తుల్లో ఏదో కొత్తదనాన్ని తీసుకొస్తూ కస్టమర్లలో ఆసక్తిని రేపుతూనే ఉంది. కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి అటు హార్డ్ వేర్, ఇటు సాప్ట్ వేర్ పరంగా యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది. చాలామంది సాధారణంగా మల్టీ టాస్కింగ్, బ్యాటరీ, కెమెరా పనితీరు మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అయితే వన్‌ప్లస్ మాత్రం వీటితో పాటు స్క్రీన్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని మంచి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ మీద డిస్ ప్లే వాల్ పేపర్స్ విషయంలో వన్‌ప్లస్ చాలా మన్నికైన ఫీచర్ తో వచ్చిందనే చెప్పవచ్చు. యాప్ కోసం వెతుక్కోకుండానే నేరుగా యాప్ దగ్గరకు మనల్ని తీసుకువెళ్లేలా స్క్రీన్ ఉంటుంది. కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తిలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

 

సరికొత్తగా Nokia X, లీకయిన ఫీచర్లు, లాంచింగ్ తేదీ, నోకియా3కి ఓరియో అప్‌డేట్‌సరికొత్తగా Nokia X, లీకయిన ఫీచర్లు, లాంచింగ్ తేదీ, నోకియా3కి ఓరియో అప్‌డేట్‌

వాల్‌పేపర్లలో ఏదో కొత్తదనం

వాల్‌పేపర్లలో ఏదో కొత్తదనం

వన్‌ప్లస్ మొబైల్ లో ఉచితంగా లోడ్ చేయబడిన అనేక రకాలైన డిస్ ప్లే వాల్‌పేపర్లలో ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఇవి చూడటానికి వాల్‌పేపర్లు మాదిరిగా ఉన్న ఇందులో చాలా అర్థవంతమైన ఆలోచనలను కలిగించేవిగా సమ్ ధింగ్ స్పెషల్ గా కనిపిస్తాయి. ఈ వాల్ పేపర్స్ ని అనుభవం కల వ్యక్తుల చేత తయారుచేయించారు. స్వీడన్ కు చెందిన Hampus Olssonఅనే ఆర్టిస్ట్ చేత వన్‌ప్లస్ వాల్ పేపర్స్ ని డిజైన్ చేయించారు.

OnePlus 3, and the 5T's

OnePlus 3, and the 5T's

OnePlus 3, and the 5T's లాంటి ఫోన్లలోని వాల్ పేపర్స్ ని చూస్తే చాలామంది కొన్ని రకాల భావాలతో కూడిన ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇతను క్రియేట్ చేసే ప్రతి వాల్ పేపర్లో ఏదో తెలియని భావం, అర్థవంతమైన ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గోవాలో నివసిస్తున్న ఈ ఆర్టిస్ట్ వన్‌ప్లస్ నుంచి రాబోతున్న అన్ని ఫోన్లకు ప్రధాన ఆర్టిస్ట్ గా పనిచేయనున్నారు. ఇతను వన్‌ప్లస్2లో క్రియేట్ చేసిన వాల్ పేపర్స్ చాలామందిని ఆకట్టుకున్నాయి కూడా. మరో ఫోన్ వన్‌ప్లస్ ఎక్స్ లో liquid metallic-styleతో కొత్త ప్రయోగం చేశారు కాని అవి కొంచెం నిరాశను కలిగించాయి. ఎందుకంటే పెయింట్ తో చేసిన ఇతర వాటిని ఫోన్లలోకి ఎంపిక చేసుకున్నారు.

OnePlus 3లో
 

OnePlus 3లో

దాని తరువాత వచ్చిన OnePlus 3లో ఇతని పనితీరు అబ్బురపరిచింది. 3డి స్పేస్ తో చాలా అందమైన బ్రష్ స్ట్రోక్స్ ఇచ్చిన గ్యాలరీ అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి. పర్వతానికి షేప్ ఇస్తూ ఆయన తీసుకువచ్చిన వాల్ పేపర్ అందర్నీ కట్టిపడేసింది. ఆ తరువాత వచ్చిన OnePlus 3టీలో ఇంకా అధునాతన రంగులను జోడించి కొన్ని రంగుల కాంబినేషన్లో మంచి ఫలితాలను రాబట్టారు.

 OnePlus 5 and OnePlus 5T

OnePlus 5 and OnePlus 5T

ఆ తర్వాత వచ్చిన OnePlus 5 and OnePlus 5Tలో ఇంకా సరికొత్తగా ప్రయోగం చేసి అబ్బురపరిచారు. చాలా సాదా బ్యాక్ గ్రౌండ్ తో అందంగా కనిపించేలా వాల్ పేపర్ ని తీర్చిదిద్దారు. ఈ వాల్ పేపర్లు చూడగానే చాలా నీట్ గా , సింపుల్ గా, ద్రవం ఉన్నట్లుగా కనిపిస్తాయి. Hampus తన పనిలో రెండు రకాల వాటిని ఫాలో అవుతారు. అవేంటంటే మంచు గుహలు, పొంగుతున్న లావాలు. ఈరెండింటితోనే వాల్ పేపర్లను అందంగా తీర్చిదిద్దారు.

OnePlus 6 ఫోన్లో

OnePlus 6 ఫోన్లో

ఇక రానున్న OnePlus 6 ఫోన్లో కూడా ఆకట్టుకునే వాల్ పేపర్లను పొందుపరిచారు. పాతవాటికే సరికొత్తగా మెరుగులు దిద్ది ఓ అద్భుతానే సృష్టించారు. పర్వతాల మాదిరిగా కనిపించే ఈ వాల్ పేపర్స్ వాస్తవికతను భ్రమింపజేసేలా ఉంటాయి. దగ్గరగా చూసిన భావనను కల్పిస్తాయి. ఇవే కాకుండా ముందు ముందు రానున్న వన్ ప్లస్ ఫోన్లలో కూడా ఈ స్వీడన్ ఆర్టిస్ట్ వాల్ పేపర్లతోనే ఫోన్లను మాయ చేస్తాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇతన పనితనం ఏంటో తెలుసుకోవాలంటే OnePlus 6 ఫోన్ లాంచ్ అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Why OnePlus wallpapers make lasting impressions on us every time more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X