Just In
- 13 min ago
ఈ App ల గురించి ఇక మరిచి పోండి..! శాశ్వతంగా బ్యాన్ అయినట్టే ...?
- 26 min ago
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
- 1 day ago
Realme స్మార్ట్ఫోన్లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?
- 1 day ago
60 అడుగులు ఉన్న నడిచే రోబోట్...! సినిమాల్లో కాదు ..నిజంగానే ?ఎక్కడో తెలుసుకోండి.
Don't Miss
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- News
ఘోర రోడ్డు ప్రమాదం... జీపు-ట్రక్కు ఢీ... 8 మంది అక్కడికక్కడే మృతి...
- Sports
ISL 2020-21: ఏటీకే మోహన్ బగాన్‌కు నార్త్ఈస్ట్ యునైటెడ్ షాక్!
- Movies
సుడిగాలి సుధీర్ తర్వాత అభిజీత్: బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో మరో రికార్డు.. దేశ వ్యాప్తంగా హైలైట్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు.
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రాండ్ అంటే నోకియానే..
'నోకియా' మొబైల్ బ్రాండ్ అంటే చాలా మందికి అమితమైన అభిమానం. నోకియా ఫోన్‌లను ఆరాధించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఒకప్పడు నెం.1గా కొనసాగిన నోకియా, ఆ తరువాత చోటుచేసుకున్న పలు విప్లవాత్మక మార్పుల కారణంగా తన మార్కెట్‌ను కోల్పొవల్సి వచ్చింది.
Read More : కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ వెలగాలా..?

మార్కెట్లో క్లిక్ కాలేకపోయాయి
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్, యాపిల్ ఫోన్‌ల హవా కొనసాగటంతో పాటు, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో మైక్రోసాఫ్ట్ విండోస్‌ను ఆండ్రాయిడ్ వెనక్కి నెట్టటంతో నోకియా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో క్లిక్ కాలేకపోయాయి.

నోకియా ఆండ్రాయిడ్..
తీవ్రమైన పోటీ నేపథ్యంలో బ్రాండ్ నోకియా రెండు, మూడు సంవత్సరాల పాటు తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొవల్సి వచ్చింది. ఆ తరువాత, నోకియా మొబైల్ ఫోన్ తయారీ హక్కులను HMD గ్లోబల్ కొనుగోలు చేయటంతో బ్రాండ్ నోకియా, ఆండ్రాయిడ్ బాట పట్టింది.
మీ ఫోన్‌లో వాట్సాప్ ఫోటోలు ఎక్కువైపోతున్నాయా..?

గ్రాండ్‌గా నోకియా రీఎంట్రీ
నోకియా రీఎంట్రీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ఎండి గ్లోబల్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా మూడు సరికొత్త నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐకానిక నోకియా 3310 ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 3, నోకియా 5, నోకియా
6 మోడల్స్‌లో అనౌన్స్ కాబడిన ఈ ఫోన్‌లు నోకియా పేరును మరోసారి మారుమోగేలా చేసాయి. నోకియా బ్రాండ్‌ను ఇప్పటికి 'ది బెస్ట్' అనటానికి పలు ఆసక్తికర కారణాలను ఇప్పుడు చూద్దాం..

సాలిడ్ బిల్డ్ క్వాలిటీ
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లతో కంపేర్ చేసి చూసినట్లయితే అప్పట్లో విడుదలైన నోకియా 3310, నోకియా 6600 వంటి ఫోన్‌లు సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఎటువంటి ప్రమాదాలనైనా సమర్ధవంతగా ఎదుర్కోగలిగేవి.

అలారమ్, స్టాప్‌వాచ్, కాలుక్యులేటర్ , 140 క్యారెక్టర్ ఎస్ఎంఎస్
యాపిల్, సామ్‌సంగ్ వంటి బ్రాండ్‌లకు సొంత టెక్నాలజీలు ఉన్నట్లు నోకియాకు కూడా సొంత ఆపరేటింగ్ సిస్టం ఒకటుంది. దాని పేరే, సింబియాన్ (Symbian). అలారమ్, స్టాప్‌వాచ్, కాలుక్యులేటర్ , 140 క్యారెక్టర్ ఎస్ఎంఎస్ సపోర్ట్, స్నేక్ గేమ్ వంటి విప్లవాత్మక ఫీచర్లను నోకియా ఆ రోజుల్లోన పరిచయం చేసింది.

విభిన్నమైన స్టైల్
ఇతర ఫోన్‌లతో కంపేర్ చేసి చూసినట్లయితే నోకియా ఫోన్‌లు విభిన్నమైన స్టైల్‌ను సంతరించుకుని ఉంటాయి. నోకియా నుంచి 10 సంవత్సరాల క్రితం లాంచ్ అయిన 8110, 3310, 6600, Nokia N-Gage, N-72, N-73 ఫోన్‌లను ఫ్రంట్ కెమరా సపోర్ట్‌ను కలిగి ఉండటం విశేషం.
ఈ ఫోన్ పై రెండు సంవత్సరాల వారంటీ

నోకియా ప్రస్థానం..
19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది. మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది.

తొలి మొబైల్ నెట్‌వర్క్..
ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది. నోకియా నుంచి విడుదలైన నోకియా 3310 ఫోన్ 20వ శతాబ్థపు అత్యుత్తమ ఆవిష్కరణగా నిలిచింది.
ఈ వారం విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా 3310, బెస్ట్ సెల్లర్
2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే చాలు..
నోకియా ఫోన్‌లను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే చాలు, కొన్ని రోజుల వరకు ఛార్జింగ్ విషయాన్ని మర్చిపోవచ్చు. నోకియా ఫోన్‌లు కిందపడినా పగలవు.
మళ్లీ ఆధార్ వెరిఫికేషన్, వివరాలు చెప్పకపోతే

నోకియా ఐకానిక్ లోగో
నోకియా ఐకానిక్ లోగోను ఎప్పటికైనా మర్చిపోగలమా చెప్పండి..? నమ్మకం అలానే విశ్వసనీయతకు మారుపేరుకు చిహ్నంగా ఈ లోగో నిలుస్తుంది.

స్నేక్ గేమ్..
సాధారణంగా సెల్‌ఫోన్‍లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. అయితే, నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమీ వంటి గేమ్‌లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

సొంతగా మ్యూజిక్‌ను కంపోజ్ చేసుకునే అవకాశం..
నోకియా ఫోన్‌లలో సొంతగా మ్యూజిక్‌ను కంపోజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇతర ఫోన్ లతో కంపేర్ చేసి చూసినట్లయితే నోకియా ఫోన్ రింగ్‌టోన్‌లు చాలా బెగ్గరగా వినిపిస్తాయి.

సౌకర్యవంతంగా జేబులో ఇమిడిపోతాయి
నోకియా ఫోన్లు ఎంచక్కా ఫ్యాంట్ జేబులో ఇమిడిపోతాయి. నోకియా ఫోన్‌లలో మెసేజ్ టైపింగ్ చాలా సులువుగా ఉంటుంది. నోకియా ఫోన్‌లతో ఇన్ బిల్ట్ గా ఇచ్చు పిక్షర్ మెసేజెస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190