Home
Mobile

వారానికి ఒక్కసారైనా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిందే.. హెచ్చరిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీ..

Turn off your phone: ఈ రోజుల్లో ఫోన్లు లేని జీవితం ఊహించలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లతోనే మనం సమయం గడిపేస్తున్నాం. అన్నిటికీ ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. కానీ వారానికి ఒక్కసారైనా మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయమని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) చెబుతోంది. మీ ఫోన్ భద్రంగా ఉండటానికి, హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవడానికి ఈ పని చేయడం తప్పనిసరి అని సూచిస్తోంది. ఎందుకో తెలుసుకుందాం.

* హ్యాకర్ల నుంచి ఫోన్‌కు రక్షణ కవచం

హ్యాకర్లు ఎప్పుడు కాచుకునే ఉంటారు. మీ ఫోన్‌లోకి ఎలా చొరబడాలా అని వెతుకుతూనే ఉంటారు. మాల్వేర్, స్పైవేర్ వంటి ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్లను పంపి మీ డేటాను దొంగిలించడానికి రెడీగా ఉంటారు. మీ ఫోన్‌లో లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉన్నా సరే, 100% సేఫ్ అని గ్యారెంటీ లేదు.

Why You Should Turn Off Your Phone Once a Week  The NSA   s Advice

కానీ వారానికి ఒక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న ఇలాంటి హానికరమైన సాఫ్ట్‌వేర్లు క్లియర్ అవుతాయి. దీంతో హ్యాకర్లకు మీ ఫోన్‌పై కంట్రోల్ సంపాదించడం కష్టం అవుతుంది. వారానికి ఒక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మీ ఫోన్‌కు ఫుల్ ప్రొటెక్షన్ కల్పించినట్లు అవుతుంది.

* ట్రాకింగ్, డేటా దొంగతనానికి చెక్

చాలా యాప్‌లు, వెబ్‌సైట్లు మీ లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ, పర్సనల్ డేటాను ట్రాక్ చేస్తూనే ఉంటాయి. కొన్ని మీ పర్మిషన్ లేకుండానే డేటా కలెక్ట్ చేస్తాయి. ఇది ఎంత డేంజరో ఆలోచించండి. కానీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల ఈ ట్రాకింగ్ ఆగిపోతుంది. టెంపరరీ ఫైల్స్ రీసెట్ అవుతాయి. స్పైవేర్ మీ గురించిన సమాచారాన్ని సేకరించడం కష్టమవుతుంది.

* ఫోన్ పర్ఫార్మెన్స్ సూపర్ ఫాస్ట్..

చాలా రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా వాడితే, బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. గుర్తుందా, మీ ఫోన్ ఒక్కోసారి స్లో అయినట్టు అనిపిస్తుంది, బ్యాటరీ తొందరగా అయిపోతుంది, యాప్స్ మధ్యలో క్రాష్ అవుతుంటాయి.

ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌ల వల్లే. కానీ రీస్టార్ట్ చేస్తే, ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు క్లియర్ అవుతాయి. మీ ఫోన్ మళ్lee కొత్త ఫోన్ మాదిరి చాలా ఫాస్ట్‌గా, స్మూత్‌గా పనిచేస్తుంది. మీ ఫోన్ పర్ఫార్మెన్స్ పెంచడానికి ఇంతకంటే ఈజీ టెక్నిక్ ఇంకొకటి ఉండదని చెప్పుకోవచ్చు.

* సాఫ్ట్‌వేర్ గ్లిచ్‌లు మాయం

కొన్నిసార్లు ఫోన్లు సరిగ్గా పనిచేయవు. యాప్ ఫ్రీజ్ అవ్వడం, స్క్రీన్ లాగ్ అవ్వడం, లేదా అసాధారణంగా ప్రవర్తించడం వంటివి జరుగుతాయి. దాంతో చిరాకు వస్తుంది. ఇలాంటప్పుడు ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తే చాలు. కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేసినట్లే, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల సిస్టమ్ రిఫ్రెష్ అవుతుంది.

చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. ఇది భవిష్యత్తులో పెద్ద సాఫ్ట్‌వేర్ సమస్యలను నివారిస్తుంది. అందుకే, వారానికి ఒక్కసారి రీస్టార్ట్ చేయడం తప్పనిసరి అని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నొక్కి మరీ చెబుతోంది. కాబట్టి ఈ పని అందరూ చేయాలి మరి ఎలా చేయాలో తెలుసుకుందాం.

* ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ఎలా

ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం రాకెట్ సైన్స్ కాదు. చాలా సింపుల్. ముందుగా మొబైల్ పవర్ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. పవర్ ఆఫ్ చేసే ఆప్షన్ కనిపించే వరకు వెయిట్ చేయాలి. ఫోన్‌ను పూర్తిగా టర్న్ ఆఫ్ చేయాలి. కనీసం 30 సెకన్లు వెయిట్ చేసి, ఆ తర్వాత మళ్లీ క్షణం ఆన్ చేయాలి, అంతే!

More from GizBot

Best Mobiles in India

English summary
Turn off your phone weekly for better security and performance, NSA advises. It protects from hackers, stops tracking, improves speed, and fixes glitches. Restarting is simple and beneficial for phone health.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X