హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అంచెలంచెలుగా విస్తరిస్తోన్న బ్రాండ్‌లలో హువాయి (Huawei) ఒకటి. చైనాకు చెందిన ఈ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన ‘హానర్ 4సీ' స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రీమియమ్ క్వాలిటీ హ్యాండ్‌సెట్ డిజైనింగ్, స్సెసిఫికేషన్స్, కెమెరా క్వాలిటీ ఇలా అన్ని విభాగాల్లో భేష్ అనిపించుకుంటోంది. రూ.10,000 ధర పరిధిలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి హువాయి హానర్ 4సీ ఉత్తమ ఎంపిక అనటానికి 10 బెస్ట్ కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పెద్ద‌దైన హై రిసల్యూషన్ డిస్‌ప్లే

హువాయి హానర్ 4సీ పెద్దదైన 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్థ్యం 1,280 × 720పిక్సల్స్. పెద్ద డిస్‌ప్లే ఇంకా మెరుగైన రిసల్యూషన్ కారణంగా వీడియోలతో పాటు ఫోటోలను క్రిస్టిల్ క్లియర్ క్వాలిటీలో వీక్షించవచ్చు.

 

హువాయి హానర్ 4సీ శక్తివంతమైన నిర్మాణ శైలితో అద్భుతమైన ఫినిషింగ్‌ను సంతరించుకుంది. ఈ ఫోన్ సౌకర్యవంతంగా చేతిలో ఇమిడిపోతుంది.

 

హువాయి హానర్ 4సీలో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ 3జీ నెట్‌వర్క్ పై 14 గంటల 36 నిమిషాల బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుంది.

 

హువాయి హానర్ 4సీలో ఏర్పాటు చేసిన స్పీకర్ వ్యవస్థ అద్భుతమైన ఆడియో క్వాలిటీని అందిస్తుంది.

 

హువాయి హానర్ 4సీలో శక్తివంతమైన 1.2గిగాహెర్ట్జ్ కైరిన్ 620 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రాసెసర్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

 

హువాయి హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2జీబి ర్యామ్ వ్యవస్థ ఫోన్ మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

 

హువాయి హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌ 8జీబి ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు  విస్తరించుకోవచ్చు.

 

హువాయి హానర్ 4సీలో ఏర్పాటు చేసిన ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్ ఫోన్ పనితీరును మరింత సౌకర్యవంతం చేస్తుంది.

 

హువాయి హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరాలో, వివిధ సెట్టింగ్స్‌ను ఉపయోగించుకుని అద్భుతమైన ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

 

హువాయి హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా మన్నికైన వీడియో కాలింగ్‌తో పాటు హై క్వాలిటీ సెల్ఫీలను తీసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why You Should Upgrade to Huawei Honor 4C: Top 10 Reasons. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot