ధర తగ్గింపు పై వికెడ్‌లీక్ వామ్మీ ప్యాషన్ ఎక్స్
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ వికెడ్‌లీక్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన ‘వామ్మీ ప్యాషన్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్ పై రూ.4,000 ధర తగ్గింపును ప్రకటించింది. ఆవిష్కరణ సమయంలో ఈ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,500. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.18,500కు సొంతం చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.

హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5 అంగుళాల పూర్తి హైడెఫినిష్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు),
5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర తగ్గింపు ఆఫర్‍లో భాగంగా వికెడ్‌లీక్ వామ్మీ ప్యాషన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








