ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుందా..?

Posted By: Staff

ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుందా..?

ఆపిల్ 6వ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్-5’ ఎప్పుడు లాంఛ్ కాబోతుంది..?, ఏ విధమైన  స్పెసిఫికేషన్‌లు ఈ గ్యాడ్జెట్‌లో ఉండబోతున్నాయ్..?, ఇలా అనేక ప్రశ్నలు టెక్ ప్రేమికుల మదిలో మెదులుతున్నాయి. అసలు ఆపిల్ ఐఫోన్-5, 2012లో విడుదలవుతుందా..?

అవును ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆపిల్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఐఫోన్ -5’ జూన్‌లో లాంఛ్ కాబోతుంది?. ఇందకు సంబంధించిన ఏర్పాట్లలో ఆపిల్ వర్గాలు నిమగ్నమైనట్లు

సదరు కంపెనీ భాగస్వామ్య తయారీసంస్ధ ఫాక్స్‌కాన్ (Foxconn) ఉద్యోగి ఒకరు తెలిపారు.

ఈ ఆవిష్కరణకు సంబంధించిన సమాచారాన్ని  WWDC సమావేశంలో వెల్లడించనున్నట్లు ఆ ఉద్యోగి వెల్లడించారు. ఈ డివైజ్ రూపకల్పనలో భాగంగా 18,000 ఉద్యోగులను హైర్ చేసుకునేందుకు ఆపిల్ ప్రయాత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఐఫోన్-5 ఫీచర్ల పై అనేక రూమర్లు వ్యక్తమవుతన్నాయి. వాటిలో పలు మఖ్యమైనవి....

*    4 అంగుళాల టచ్ స్ర్కీన్,

* A5 లేదా A6 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

*   8 మెగా పిక్సల్ కెమెరా.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot