అదే జరిగితే లాభం ఎవరికో..?

స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ హెచ్‌టీసీ తన వన్ సిరీస్ నుంచి ‘వన్ ఎస్’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది. 1.7 గిగాహెడ్జ్ సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో సమర్థవంతంగా రూపుదిద్దుకున్న ఈ ఫోన్ అక్కడి యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇండియన్ వర్షన్‌లో విడుదల కాబోతున్న ‘వన్ ఎస్’ 1.5 గిగాహెడ్జ్ సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని మునుపటి నివేదికులు స్పష్టం చేస్తున్నాయి. అయితే, తైవాన్ ‘వన్ ఎస్’ మాదిరిగానే ఇండియాలో విడుదల చేస్తున్న ‘వన్ ఎస్’స్మార్ట్‌ఫోన్‌లో సమాన ప్రాతిపదికతో కూడిన 1.7 గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు రూమర్లు వ్యక్తమవుతున్నాయి.
హెచ్‌టీసీ ‘వన్ ఎస్’ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 క్రెయిట్ ప్రాసెసర్,
ఆడ్రినో 224 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,
4.3 అంగుళా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
గొరిల్లా గ్లాస్,
8 మెగా పిక్సల్ కెమెరా,
వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా,
బీట్స్ ఆడియో వ్యవస్థ.
భారత్ విపణిలో జూన్ 8న విడుదల కాబోతున్న హెచ్‌టీసీ ‘వన్ ఎస్’ ధర రూ.33,000. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ద మొబైల్ స్టోర్’ హ్యాండ్‌సెట్‌ను రూ.33,000కు ఆఫర్ చేస్తుంది.
నచ్చితే కొనండి, బోలెడంత డిస్కౌంట్!
స్టైలిష్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న హెచ్‌టీసీ 2011, ఆగష్టులో క్వీర్టీ కీప్యాడ్‌తో కూడిన ‘చాచా’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బ్రాండ్ నుంచి విడుదలైన తొలి క్యాండీ బార్ ఫోన్‌గా హెచ్‌టీసీ చాచా గుర్తింపుతెచ్చుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన విశిష్టతను పరిశీలిస్తే నేరుగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించేవచ్చు. ఇందు కోసం ప్రత్యేక బటన్‌ను కీప్యాడ్ కిందభాగంలో అమర్చారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో అనుసంధానించబడిన ఈ ఫోన్ కమ్యూనికేషన్ బంధాలను మరింత బలపరుస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆవిష్కరణ సమయంలో కంపెనీ నిర్ధేశించిన ధర రూ. 15,000. మారిన పరిస్థితుల నేపధ్యంలో ఈ ధరను 12,500కు తగ్గించారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ Saholic.com, ఈ ఫోన్ కొనుగోలు పై రూ.3,000 రాయితీని ప్రకటించింది. అంటే ఈ రిటైలర్ ద్వారా ‘హెచ్‌టీసీ చాచా’ను రూ.9,699కి సొంతం చేసుకోవచ్చన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక. ప్రత్యర్థి బ్రాండ్‌లకు పోటీనివ్వటంలో ‘హెచ్‌టీసీ చాచా’ వైఫల్యం చెందటం కారణంగానే ధర తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications