Home
Mobile

మరో షాక్‌ :251 ఫోన్‌పై రూ.13 లాభం వస్తుందట

By Hazarath

251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ సంచంలనం సృష్టించిన రింగింగ్ బెల్ కంపెనీ మరో సంచలనపు వార్తతో తెరమీదకొచ్చింది. మాకు 251 ఫోన్ కష్టమర్లకు అమ్మితే వారినుంచి 13 రూపాయలు లాభం వస్తుందని సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయెల్ చెప్పారు. ఇప్పటికే కంపెనీలన్నీ 251 మొబైల్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోతుంటే మళ్లీ 13 రూపాయల లాభమంటూ మరో షాకింగ్ కు రింగింగ్ బెల్స్ కంపెనీ తెరలేపింది. దిగ్గజ కంపెనీలు అది ఎలా సాధ్యమని తలలుపట్టుకుంటున్నాయి.

Read more: రూ. 251తో మేక్ ఇన్ ఇండియా కల చెదిరిందా..?

అన్ని కంపెనీలు ఆశ్చర్యంతో పాటు అనేక సందేహాలను

అన్ని కంపెనీలు ఆశ్చర్యంతో పాటు అనేక సందేహాలను

రింగింగ్‌ బెల్స్ కంపెనీ నుంచి అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి ప్రకటన వెలువడగానే అన్ని కంపెనీలు ఆశ్చర్యంతో పాటు అనేక సందేహాలను లేవనెత్తిన విషయం విదితమే. ఇక సామాన్య జనమయితే 251కే 3జీ మొబైల్ అంటూ బుకింగ్ ల కోసం కంప్యూటర్ మీద కుస్తీలు కూడా పడ్డారు.

ప్రభుత్వ వర్గాలు కూడా ఇది ఎలా సాధ్యమంటూ కూపీ లాగే పనిలో

ప్రభుత్వ వర్గాలు కూడా ఇది ఎలా సాధ్యమంటూ కూపీ లాగే పనిలో

ప్రభుత్వ వర్గాలు కూడా ఇది ఎలా సాధ్యమంటూ కూపీ లాగే పనిలో పడ్డాయి. అయితే ఇక్కడ ఇంత జరుగుతున్నా రింగింగ్‌ బెల్స్ డైరెక్టర్‌ మోహిత్ గోయల్‌ మాత్రం రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని బల్లగుద్ది చెబుతున్నారు.

మా లెక్కలు మాకున్నాయంటూ అవి ఎవరికీ తెలియవంటూ

మా లెక్కలు మాకున్నాయంటూ అవి ఎవరికీ తెలియవంటూ

అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. మా లెక్కలు మాకున్నాయంటూ అవి ఎవరికీ తెలియవంటూ అన్నీ లెక్కలు వేసుకున్నాకే మేము దాన్ని అమల్లోకి తెచ్చామని వారు చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు

ఫిబ్రవరి 18న ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు.

ఆన్‌లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్‌మెంట్ గేట్‌వే ద్వారా

ఆన్‌లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్‌మెంట్ గేట్‌వే ద్వారా

ఆన్‌లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్‌మెంట్ గేట్‌వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని మోహిత్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో స్పష్టం చేశారు.

తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే

తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే

తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే 'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు.

కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని

కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని

కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్‌ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు.

రింగింగ్ బెల్స్ కంపెనీ ఒక్కో న్యూస్ బయటకు

రింగింగ్ బెల్స్ కంపెనీ ఒక్కో న్యూస్ బయటకు

ప్రభుత్వ వర్గాలు సైతం బిత్తరపోయేలా రింగింగ్ బెల్స్ కంపెనీ ఒక్కో న్యూస్ బయటకు వదులుతోంది. అన్ని కంపెనీలు కూడా ఇది ఎలా సాధ్యమంటూ ఇప్పటికే కూపీలు లాగుతున్నాయి. మరి ముందు ముందు 251 ఫోన్ ఇంకెన్ని సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write Will make profit of Rs 31 on each Rs 251 phone: Mohit Goel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X