అందరం వేచిచూస్తున్న ఫోన్ ఆగస్టు 16న విడుదల..?

Posted By: Super

అందరం వేచిచూస్తున్న ఫోన్ ఆగస్టు 16న విడుదల..?

న్యూఢిల్లీ: ఆగస్టు రెండో వారంలో ఐఫోన్ 5 మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని సినెట్ డాట్ యూకే తెలిపింది. బ్రిటన్‌లో ఐఫోన్ విక్రయాల కోసం సిబ్బంది కావాలంటూ ఉద్యోగ ప్రకటన వచ్చిందని వివరించింది. దీంతో యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఆగస్టు మధ్య కల్లా మార్కెట్లోకి వచ్చే అవకాశాలుంటాయని ఈ సంస్థ విశ్లేషిస్తోంది. ఐఫోన్ 5 కోసం అవసరమైన గాలియం ఆర్సినైడ్(గాలియం, ఆర్సెనిక్‌ల సమ్మేళనం, సెమీ కండక్టర్) సరఫరా చేసే మూడు సంస్థలను యాపిల్ సంస్థ షార్ట్‌లిస్ట్ చేసిందని యాపిల్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి వచ్చే ఈ ఫోన్‌ను భారీ స్థాయిలో తయారు చేయనున్నారు. ఇప్పటి నుంచి సెప్టెంబర్‌లోగా ఎప్పుడైనా ఐఫోన్ 5 మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని డిజిటైమ్స్ ఇటీవలనే వెల్లడించింది. కోటిన్నర ఐఫోన్‌లు తయారు చేయాలంటూ పెగట్రాన్ సంస్థకు ఈ నెల ప్రారంభంలో యాపిల్ ఆర్డర్ ఇచ్చిందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot