రూ. 299కే ఫీచర్ ఫోన్, ఇక జియో ఫోన్ తుస్సేనా ..?

Written By:

జియో ప్రభంజనానికి అడ్డుకట్టవేసేందుకు అన్ని రకాల దారులను టెల్కోలు అలాగే మొబైల్ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. జియో రాకతో కుదేలయిన టెలికం రంగానికి మళ్లీ ఎలాగైనా పునర్ వైభవం తీసుకురావాలని టెల్కోలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో ఫోన్ బుకింగ్స్ మొదలైన తరుణంలో దానికి షాక్ ఇచ్చేందుకు మొబైల్ కంపెనీలు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా డీటెల్ అనే స్వదేశీ కంపెనీ రూ. 299కే ఫీచర్ ఫోన్ అంటోంది.

లోన్‌కి డాక్యుమెంట్లు అవసరం లేదు, ఏంచక్కా ఫేస్‌బుక్ ఉంటే చాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంబానికి షాక్‌ ఇస్తూ​

జియో వినియోగదారులందరికి ఉచితంగా ఫోన్‌ అందిస్తామని ప్రకటించిన అంబానికి షాక్‌ ఇస్తూ​ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ రానుంది.

కేవలం రూ.299కే

కేవలం రూ.299కే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్ అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్‌ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఇండియా స్మార్ట్‌ఫోన్‌

రిలయన్స్‌ అధినేత జియో ఫోన్‌ను ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా ప్రకటించగా, ఇది మాత్రం స్మార్ట్‌ ఫోన్‌ కాదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇండియాలో తయారైన ఫీచర్‌ ఫోన్‌

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇండియాలో తయారైన ఫీచర్‌ ఫోన్‌ ఇది. ప్రముఖ గాడ్గెజ్‌ విశ్లేషకుడు రాజీవ్‌ మఖ్నీ ఈ ఫోన్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఫీచర్స్

అయితే దీనిలో ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
ఫోన్‌ వివరాలు
1. 44 మోనో క్రోమ్ డిస్ప్లే అండ్
650ఎంఏహెచ్‌ బ్యాటరీ
సింగిల్‌ సిమ్‌కార్డు
టార్చ్‌లైట్‌
ఎఫ్‌ఎం రేడియో
స్పీకర్‌
వైబ్రేషన్‌ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేయాలన్నా

ఈ మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేయాలన్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా http://detel-india.com/ కంపెనీ వెబ్ సైట్ కు లాగిన్ కాగలరని మనవి.

అత్యంత తక్కువ ధరకే

ఇవే కాక కంపెనీ వెబ్ సైట్ లో అత్యంత తక్కువ ధరకే అనేక రకాల ఫోన్లు లభిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Will this Rs 299 Detel D1 handset kill Jio Phone? Here are its features and specifications Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting