మీ ఫోన్‌లో రేడియేషన్ స్థాయి ఎంత? ఇప్పుడే చెక్ చేసుకోండి

|

మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతుందంటూ అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో పలు రిసెర్చ్ సంస్థలు మరోమారు పరిశోధనలకు తెరతీసాయి. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వెలువడుతోన్న రేడియేషన్ మనిషి డీఎన్ఏ పై చెడు ప్రభావం చూపే అవకాశముందని పలువురు ఆందోళణవ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలను మనం గమనింనచినట్లయితే స్మార్ట్ ఫోన్ లకు, క్యాన్సర్లకు ఏ విధమైన సంబంధం లేదని తేలింది.

ఫోన్‌లు కార్సినోజెనిక్ అయినప్పటికి...

ఫోన్‌లు కార్సినోజెనిక్ అయినప్పటికి...

ఫోన్‌లు కార్సినోజెనిక్ అయినప్పటికి, ఇవి విడుదల చేసే రేడియేషన్ మనిషి డీఎన్ఏ పై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ ఎంతో కొంత మొత్తంలో నాన్ - అయోనైజింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ రేడియోషన్ వాల్యూను నిర్దిష్ట శోషణ రేటు (SAR) ద్వారా కాలుక్యులేట్ చేయటం జరుగుతుంది.

SAR అంటే ఏంటి..?

SAR అంటే ఏంటి..?

ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలు రిసీవ్ లేదా ట్రాన్స్ మిట్ అయినపుడు కొంత శాతం తరంగాలను అవి కోల్పోవటం జరుగుతుంది. అలా కోల్పోయిన తరంగాలను చుట్టుపక్కల ఉన్న బాడీ టిష్యూస్ గ్రహించేస్తుంటాయి. ఈ విధంగా గ్రహించబడిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలు శాతాన్ని SAR లెక్కిస్తుంది. ఫోన్‌లలో నిక్షిప్తం చేసే రేడియో ట్రాన్స్‌మిటర్స్ అలానే రిసీవర్స్ కార్సినోజెనిక్ రేడియో తరంగాలను నిరంతరం ఎమిట్ చేస్తూనే ఉంటాయి. అయితే అవి ఏమాత్రం ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు.

ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ ఆమోదం..

ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ ఆమోదం..

అమెరికాకు చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (ఎఫ్‌సీసీ), SAR లెవల్‌ను 1.6 W/Kgగా సెట్ చేసింది. ఇదే విధమైన మెజర్‌మెంట్‌ను ఇండియాలో కూడా ఫాలో అవుతన్నారు. ఫోన్‌లో రేడియేషన్ లెవల్ 1.6W/kg కంటే ఎక్కువుగా ఉన్నట్లయితే దానిని ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుంది.

మీ ఫోన్‌లో SAR వాల్యూను చెక్ చేసుకోవాలంటే..?

మీ ఫోన్‌లో SAR వాల్యూను చెక్ చేసుకోవాలంటే..?

మీ ఫోన్‌కు సంబంధించిన SAR వాల్యూను చెక్ చేసుకోవాలంటే ప్యాకేజింగ్ వెనుక భాగంలో రాయటం జరుగుతుంది. మరొక మార్గంలో మీ ఫోన్ తయారీదారుకు సంబంధించిన వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినట్లయితే SAR వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ నుంచి *#07#కు డయల్ చేయటం ద్వారా SAR వాల్యూను తెలుసుకోవచ్చు.

SAR వాల్యూ ఎంతవరకు ఉత్తమం?

SAR వాల్యూ ఎంతవరకు ఉత్తమం?

ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ చెబుతోన్న దాని ప్రకారం SAR లెవల్ అనేది 1.6 W/Kgలోపుగా ఉంటే దానికి సురక్షితంగా భావించవచ్చు.

స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి దూసుకొస్తున్న TCL,ఆ టీవీలకు గట్టి పోటీస్మార్ట్‌టీవీ మార్కెట్లోకి దూసుకొస్తున్న TCL,ఆ టీవీలకు గట్టి పోటీ

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు..

మీ ఫోన్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీ మొబైల్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి. ఫోన్‌లను చెవి దగ్గర పెట్టకుని గంటల తరబడి మాట్లాడకండి. హెడ్‌సెట్‌ వాడడం రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

మాట్లాడుతున్నప్పుడే కాదు...

మాట్లాడుతున్నప్పుడే కాదు...

మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు. సాధ్యమైనంతవరకు మీ సంభాషనలను మెసేజ్‌లతోనే ముగించేయండి. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

మరన్ని జాత్రగ్తలు..

మరన్ని జాత్రగ్తలు..

ముఖ్యంగా చిన్నపిల్లలను ఫోన్‌లను దూరంగా ఉంచాలి. బయటకు వెళ్లినపుడు ప్యాంటు, చొక్కా జేబుల్లో కన్నా సంచీలో వేసుకోవటం మంచిది. సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా రేడియేషన్ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Best Mobiles in India

English summary
Do phones, and particularly smartphones cause cancer? So, the indications are that they don't. Most of the research that has been carried out so far hints that phones do emit radiation because of the radio waves but it is not strong enough to damage DNA.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X