విండోస్ ఫోన్ 8 ఆవిష్కరణ... కొత్త వోఎస్ ప్రత్యేకతలేంటి?

By Prashanth
|
Windows Phone 8


మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తన సరికొత్త విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టంను సోమవారం ఆవిష్కరించింది. ఈ సరికొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్ వోఎస్ యూజర్‌కు వ్యక్తిగత మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుందని ఆవిష్కరణ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వర్గాలు పేర్కొన్నాయి. విండోస్ ఫోన్ 8 ప్రత్యేకతల పై సమీక్ష.....

 

లైవ్ టైల్స్:

విండోస్ ఫోన్ 8 వోఎస్‌కు లైవ్‌టెల్స్ గుండె ఇంకా ఆత్మగా భావించవచ్చు. ఈ సౌలభ్యతతో యూజర్లు తమ ఐకానిక్ స్టార్ట్ స్ర్కీన్‌ను నచ్చిన రీతిలో ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రకాలైన లైవ్ టైల్స్ 20 బ్రైట్ కలర్ ఎంపికల్లో ఉంటాయి. అభిరుచిని బట్టి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

 

లైవ్ అప్లికేషన్స్:

లైవ్ అప్లికేషన్స్ ఫీచర్ విండోస్ ఫోన్ 8 విశిష్టతను మరింత రెట్టింపు చేస్తుంది. వీటి ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే అనేక అంశాలకు సంబంధించి తాజా సమచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ లైవ్ అప్లికేషన్ ఫేస్‌బుక్ ఆకౌంట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను అప్‌డేటెడ్ వాల్ పేపర్‌లతో చూపిస్తుంది.

ఇతర అప్లికేషన్‌లు:

విండోస్ ఫోన్ స్టోర్‌లో 120,000 అప్లికేషన్‌లు కొలువుతీరు ఉన్నాయి. రోజు వందల సంఖ్యలో కొత్త అప్లికేషన్‌లు జతవుతుంటాయి. వీటిలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా.. విండోస్ ఫోన్ 8 యూజర్లు ప్రముఖ ఇంటర్నెట్ రేడియో స్టేషన్ పాండారో నుంచి ఉచిత మ్యూజిక్‌ను ఆస్వాదించే విధంగా మైక్రోసాఫ్ట్ వీలు కల్పించనుంది. ఈ సౌలభ్యత 2013 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

కిడ్స్ కార్నర్:

చిన్నారులను ఉద్దేశించి ఈ అప్లికేషన్‌ను వృద్ధి చేశారు. ఇక పై విండోస్ ఫోన్ 8 యూజర్లు తమ చిన్నారుల చేతిన తమకు స్మార్ట్‌‌ఫోన్‌ను నిశ్చింతగా ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ చిన్నారుల దృష్టిని గేమ్స్ వైపు మాత్రమే మళ్లిస్తుంది.

రూమ్స్ ఫీచర్:

ఈ ఫీచర్ ద్వారా మీ మిత్రులను వివిధ గ్రూపుల క్రింద విభజించి ముఖ్యమైన గ్రూపులతో మాత్రమే ఛాటింగ్ లేదా ఇతర సంభాషణలు సాగించవచ్చు. క్యాలెండర్స్, షాపింగ్ జాబితా, ఫోటోస్ తదితర అంశాలను షేర్ చేసుకోవచ్చు.

డెటా సెన్స్:

ఈ సరికొత్త ఫీచర్ డేటా యూసేజ్‌ను మరింత అదనం చేస్తుంది. వెబ్ ఇమేజ్‌లను కంప్రెస్ చేసి డేటా యూసేజ్ ఖాళీని మరింత పెంచుతుంది. డేటా ప్లాన్ పరిధిని మించుకండా అప్లికేషన్ అప్రమత్తం చేస్తుంది.

వాలెట్ ఇంకా నియర్ - ఫీల్డ్ కమ్యూనికేషన్స్:

విండోస్ ఫోన్ 8 సరికొత్త వాలెంట్ టెక్నాలజీలను పరిచయం చేస్తోంది. ఈ సౌలభ్యతతో బిల్లులను వయా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ద్వారా చెల్లించవచ్చు. ఈ వాలెట్ ఫీచర్ డెబిట్, క్రెడిట్, లాయల్టీ ఇంకా మెంబర్ షిప్‌కార్డ్ సమాచారాన్ని భద్రంగా పదిలపరుస్తుంది.

విండోస్ ఫోన్ 8 ఆధారితంగా స్పందించే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు....

లూమియా 920:

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

లూమియా 820:

4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, క్లియర్ బ్లాక్ టెక్నాలజీ, రిసల్యూషన్ 480 × 800పిక్సల్స్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్ ప్రాసెసర్), 1జీబి ర్యామ్, 8.7 మెగా పిక్సల్ కెమరా (కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా, రెడ్, ఎల్లో, గ్రే, సియాన్, పర్పిల్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, 8జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వైర్‌లెస్ ఛార్జింగ్, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్.

హెచ్‌టీసీ 8ఎక్స్:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్), 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, హెచ్‌టీసీ ఇమేజ్ చిప్ టెక్నాలజీ, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సామర్ధ్యం, 2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లూటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ 802.11 Wi-Fi a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్ గేమ్స్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ ఏటీఐవీఎస్ విండోస్ ఫోన్ 8:

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్, 8.7మిల్లీమీటర్ల మందం, 1.5గిగాహెర్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఫోన్ మెమెరీ 16జీబి, 32జీబి, స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్ డిస్‌ప్లే, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X