మైక్రోసాఫ్ట్ ప్రపంచాన్ని శాసించనుందా..?

Posted By: Super

మైక్రోసాఫ్ట్ ప్రపంచాన్ని శాసించనుందా..?

లేటెస్ట్ వర్షన్ మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ ఫోన్ 8’ అక్టోబర్ 29న విడుదల కాబోతుందని జడ్‌డినెట్ (ZDNet) వెల్లడించింది. ఈ కార్యక్రమానికి మూడు రోజులు ముందు అంటే అక్టోబర్ 26న విండోస్ 8 పీసీ ఇంకా టాబ్లెట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విడుదల కాబోతుంది. ఇంచు మించు మూడు రోజుల వ్యవధిలో చోటుచేసుకోనున్న ఈ జంట ఆవిష్కరణలు యావత్ టెక్ ప్రపంచాన్ని ఉత్కంఠకు లోను చేస్తున్నాయి.

విండోస్ ఫోన్ 8 మొబైల్ వర్షన్ వోఎస్ ప్రత్యేకతలు:

విండోస్ 8లో ఉపయోగించిన కోర్ టెక్నాలజీనే విండోస్ ఫోన్ 8 రూపకల్పనలో ఉపయోగించారు. సరికొత్త ఫీచర్లతో వృద్ధి చెందిన విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం ఇటు వినియోగదారులతో పాటు డెవలపర్స్ ఇతర వ్యాపార వర్గాలకు పూర్తి స్ధాయిలో ఉపయోగపడుతుంది. ఫ్లెక్సిబుల్ న్యూ స్టార్ట్ స్ర్కీన్ ఫీచర్ విండోస్ ఫోన్ 8లోని ప్రత్యేకత. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ వోఎస్ మల్టీకోర్ ప్రాసెసర్లను సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా పెద్దవైన, పొదునైన డిస్‌ప్లేలను సపోర్ట్ చేసింది. ఎన్ఎఫ్‌సి వైర్‌లెస్ షేరింగ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 10, బెటర్ మ్యాపింగ్ వంటి ఉత్తమ ఫీచర్లను విండోస్ ఫోన్ 8 కలిగి ఉంది.

విడుదలకు సిద్ధంగా విండస్ ఫోన్ 8 హ్యాండ్‌సెట్‌లు:

విండోస్ ఫోన్ 8 మొబైల్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విడుదల నేపధ్యంలో మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ మొబైల్ నిర్మాణ సంస్థలు నోకియా, హెచ్‌టీసీ, సామ్‌సంగ్‌లు విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లను వృద్ధి చేస్తున్నాయి. ఐఎఫ్ఏ 2012 గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా సౌత్‌కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ విండోస్ ఫోన్ 8 ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఏటీఐవీ ఎస్ (ATIV S)ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెప్టంబర్ 5న నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో నోకియా విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించనుంది. హెచ్ టీసీ, హువావీ తదితర బ్రాండ్‌లు ఇదే బాటలో నడుస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot