Home
Mobile

విండోస్ ఫోన్‌ శకం ముగిసింది

ప్రతి 10 విండోస్ ఫోన్‌లలో 8 ఫోన్‌లు విండోస్ 8.1 పై రన్ అయ్యేవే..

By Sivanjaneyulu Bommu

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి టెక్ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ప్రఖ్యాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలలో ఒకటైన విండోస్ ఫోన్ 8.1ను చాలా మంది విండోస్ ఫోన్ యూజర్లు వినియోగించుకుటున్నారు. తమ ఫోన్ బిజినెస్‌ను పునర్‌ వ్యవస్థీకరించుకునే క్రమంలో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

80 శాతం విండోస్ ఫోన్‌ల పై ప్రభావం..

80 శాతం విండోస్ ఫోన్‌ల పై ప్రభావం..

మార్కెట్ అంచనాల ప్రకారం దాదాపు 80 శాతం విండోస్ ఫోన్‌లు విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఫోన్‌లకు ఇక పై ఏ విధమైన విండోస్ ఫోన్ 8.1 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లభించవు.

పాత వర్షన్‌లకు స్వస్తి పలుకుతోన్న విండోస్...

పాత వర్షన్‌లకు స్వస్తి పలుకుతోన్న విండోస్...

విండోస్ ఫోన్ 8.1 కంటే ముందర వర్షెన్‌లైన విండోస్ ఫోన్ 8, విండోస్ ఫోన్ 7.ఎక్స్‌లకు సంబంధించిన టెక్ సపోర్ట్‌ను 2016, జనవరిలోనే మైక్రోసాఫ్ట్ నిలిపి వేసింది.

సెక్యూరిటీ అంశాల దృష్ట్యా..

సెక్యూరిటీ అంశాల దృష్ట్యా..

సెక్యూరిటీ అంశాల దృష్ట్యా వాట్సాప్, ఎవర్‌నోట్ వంటి యాప్స్ విండోస్ పాత వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలకు దూరమవుతోన్న విషయం తెలిసిందే.

2014లో రిలీజ్ అయ్యింది...

2014లో రిలీజ్ అయ్యింది...

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టంను 2014లో రిలీజ్ చేయటం జరిగింది. Cortana ఫీచర్ ను పరిచయం చేసింది కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమే. 2015లో ఈ ఓఎస్‌ను రీప్లేస్ చేస్తూ విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ వెలుగులోకి తీసుకువచ్చింది.

విండోస్ 10కు స్విచ్ కావల్సి ఉంటుంది

విండోస్ 10కు స్విచ్ కావల్సి ఉంటుంది

విండోస్ ఫోన్ 8.1 నిలిపివేత నేపథ్యంలో విండోస్ ఫోన్ యూజర్లు విండోస్ 10 మొబైల్ ఓఎస్‌కు స్విచ్ కావల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Windows Phone Is Officially Dead. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X