విజృంభించేందుకు ‘విండోస్’ సిద్ధం!

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచాలనికి తెరలేపింది. సరికొత్త విండోస్ ఫోన్ టాంగో ఆపరేటింగ్ సిస్టంను రానున్న జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లోకి రానున్న టాంగో ఆపరేటింగ్ సిస్టం అత్యాధునిక ఫీచర్లను కలిగి యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది. ఈ వోఎస్ తొలి ఎడిషన్‌ను చైనాలో లాంఛ్ చేస్తారు. తరువాత ఇతర దేశాల్లో ఉంటుంది. కాగా, విండోస్ ఫోన్ టాంగో అప్‌డేట్‌ను ఇప్పటికే వృద్థి చేసినట్లే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
విండోస్ ఫోన్ ట్యాంగో ఆధారితంగా పనిచేసే నోకియా లూమియా 610 ఫీచర్లు:
3.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,
విండోస్ ఫోన్ 7.5 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెడ్జ్ సింగిల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
హై క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,
3జీ కనెక్టువిటీ, ఎడ్జ్,
జీపీఆర్ఎస్, వై-ఫై,
బ్లూటూత్, జీపీఎస్,
యూఎస్బీ 2.0,
ఇంటర్నల్ మెమరీ 8జీబి,
ఎక్సటర్నల్ మెమెరీ 16జీబి,
నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),
బ్యాటరీ స్టాండ్ బై 580 గంటలు, ధర రూ.11,000.
ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అదనపు అప్లికేషన్‌లు ఫోటో ఎడిటర్, ప్రిడిక్టివ్ టెక్స్ట్ ఇన్‌పుట్, వాయిస్ మెమో, క్యాలెండర్, పీసీ సింక్రనైజేషన్ వంటి అంశాలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఫోన్‌లో పొందుపరిచిన హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రౌజర్ ద్వారా వినియోగదారుడు వివిధ గేమింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications







