‘ఆపరేషన్ 2012’.. టార్గెట్ ఎవరు?

Posted By: Prashanth

‘ఆపరేషన్ 2012’.. టార్గెట్ ఎవరు?

 

2011లో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన మొబైల్ తయారీ సంస్థలు, 2012లో ఆ లోటును తీర్చుకునేందుకు కసరత్తులు ప్రారంభించాయి. గుగూల్ ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి చెక్ పెట్టే యోచనతో మైక్రో‌సాఫ్ట్ విండోస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

విండోస్ లేటెస్ట్ ‘7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం’ అప్‌డేట్‌తో ఈ జనవరిలో విడుదల కాబోతున్న నోకియా లూమియా స్మార్ట్ ఫోన్ పై ఇప్పటికే అంచనాలు ఊపందుకున్నాయి.

2012ను టార్గెట్ గా పెట్టకున్న విండోస్ పటిష్టమైన వ్యూహరచనను అనుసరించబోతోంది. ఆండ్రాయిడ్ ను అధిగమించటమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ‘విండోస్ ఫోన్ 7 ట్యాంగో అపడేటెడ్’ ఫోన్ లను తక్కువ ధరలకే అందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విండోస్ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య మధ్య తరగతి వినియోగదారులకు టెక్నాలజీని మరింత చేరవ చేస్తుందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

సరికొత్త విండోస్ 7 ట్యాంగో అప్‌డేట్ LTE ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుందా లేదా అన్న అంశం పై తీవ్ర సందిగ్ధత నెలకుంది. 2012 చివరి త్రైమాసికంలో విండోస్ నుంచి రాబోతున్న ‘ఆపోలో అపడేట్’ ఖచ్చితంగా LTE ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుందని వినికిడి. 2012 లక్ష్యంగా మైక్రోసాప్ట్ అనుసరిస్తున్న వ్యూహాలు ఏ మేరకు సత్ఫలితాలను రాబడతాయో వేచి చూడాలి మరి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot