త్వరలో 'విండోస్ టాంగో' ఆపరేటింగ్ సిస్టమ్

Posted By: Super

త్వరలో 'విండోస్ టాంగో' ఆపరేటింగ్ సిస్టమ్

 

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఎవరినోట విన్నా ఎక్కువగా వినిపిస్తున్న ఆపేరేటింగ్ సిస్టమ్ పేరు విండోస్ ఫోన్ 7.5. విడుదలైన అతి తక్కువ కాలంలో ఎక్కువ విమర్శకుల మనసు దొచుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఫోన్ 7.5. మార్కెట్లో విండోస్ ఫోన్ 7.5 బాగా సక్సెస్ సాధించడానికి గల కారణం ఇందులో యూజర్ ప్రెండ్లీ ఆఫ్షన్స్ ఎక్కువగా ఉండడమే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రస్తుతం మార్కెట్లో ఎక్కవగా వాడుతున్న మొబైల్ తయారీదారులు హెచ్‌టిసి, నోకియా.

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని టెక్నాలజీ గెయింట్ మైక్రోసాప్ట్ సంస్ద రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ డేట్‌గా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఫోన్ 7.1 టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. ఐతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మైక్రోసాప్ట్ అధికారకంగా ప్రకటించ లేదు.

విండోస్ ఫోన్ 7.1 టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని మైక్రోసాప్ట్ విడుదల చేయడం వెనుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే తక్కువ రకం డివైజ్‌లను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేసిందని ఇంటర్నెట్లో రూమర్. అంతేకాకుండా విండోస్ ఫోన్ 7.1 టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్స్ ధరలు కూడా చాలా తక్కువగా ఉండనున్నాయి. దీంతో మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌కి ఉన్న గిరాకీ కూడా తగ్గి, అందరి చూపులు విండోస్ ఫోన్స్‌పై మరల్చేందుకే ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేయడం జరుగుతుంది

ఇది మాత్రమే కాకుండా విండోస్ ఫోన్ 7.1 టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్స్‌ని చైనా, ఇండియా లాంటి దేశాలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. తక్కువ ధరలో విడుదల కానున్న ఈ విండోస్ ఫోన్ 7.1 టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ స్మార్ట్ ఫోన్స్ తప్పకుండా మార్కెట్లో పెద్ద సక్సెస్‌ని సాధిస్తాయని నోకియా, హెచ్‌టిసి యాజమాన్యాలు భావిస్తున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లో మైక్రోసాప్ట్ ఈ విండోస్ ఫోన్ 7.1 టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot