ప్రపంచ వ్యాప్తంగా నమ్మకానికి ప్రతిరూపంగా ముద్రపడిన మైక్రోసాఫ్ట్ 'ట్యాంగో" పేరుతో సరికొత్త విండోస్ 7.5 మ్యాంగో ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఈ ఫోన్లు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నాయి. ఆసియన్ మార్కెట్లో వీటి అమ్మకాలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలుస్తోంది.
విండోస్ ఫోన్ 7ను వినియోగిస్తున్న వినియోగదారులు న్యూ మ్యాంగో అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వర్షన్ వచ్చే నెలలో విడుదల కానుంది. అయితే మార్కెట్ వర్గాల్లో మాత్రం మరో పుకారు షికారు చేస్తుంది. విండోస్ 7కు సంబంధించి మరో వర్షన్ మార్కెట్లో విడుదల కానుందని సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే మ్యాంగో ఆధారిత ఫోన్లు ఈ ఏడాది చివరిలో ఇండియన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇవి గనక మార్కెట్లో క్లిక్ అయితే మరిన్ని మ్యాంగో ఆధారిత ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టునున్నట్లు సమచారం. ఇదిలా ఉండగా మార్కెట్లో విడుదల కాబోతున్నట్యాంగో ఫోన్ల పై మాత్రం అంచానాలు భారీ స్థాయిలో ఉన్నాయి.