మీ భాగస్వామికి అదిరిపోయే వాలెంటైన్ గిఫ్ట్!!

ప్రేమికుల రోజు సాక్షిగా మీ బంధాలను మరింత బలపర్చేందుకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఎదురుచూస్తుంది. స్మార్ట్‌ఫోన్ తయారీలో విభాగంలో విశిష్ట ఖ్యాతిని గడించిన శామ్‌సంగ్, లాఫ్లియర్ ఎడిషన్ నుంచి స్టైలిష్ మొబైల్‌ను డిజైన్ చేసింది. శామ్‌సంగ్ వేవ్ వై నూమూనాలో తయారుకాబడిన ఈ సొగసరి గ్యాడ్జెట్ ప్రస్తుతం ఉక్రెయిన్ ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యమవుతుంది. పర్పిల్ బ్లాక్ బాడీ ప్యానల్‌తో విలక్షణంగా రూపుదిద్దుకున్న ఈ స్మార్టీ డివైజ్ మనసును రంజింపచేస్తుంది.
మొబైల్ ముఖ్య విశేషాలు:
* అందమైన శరీరాక్ళతి,
* 3.2 అంగుళాల డిస్ ప్లే,
* వై-ఫై,
* బ్లూటూత్ 2.0.
* జీపీఎస్,
* HSDPA అనుకూలత,
* 2జీబి మెమరీ సామర్ధ్యం,
* 2 మెగా పిక్సల్ కెమెరా,
* ఎన్ఎఫ్‌సీ చిప్,
* ఇతర ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.
ఫిబ్రవరి ప్రధమాంకంలో ఈ ఫోన్ అంతర్జాతీయంగా విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. ఇండియన్ మార్కెట్లో అంచనా విలువు రూ.10,000.


Click it and Unblock the Notifications








