ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌తో ‘స్వైప్ సెన్స్’ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్వైప్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రత్యేకతతో కూడిన సరికొత్త స్వైప్ సెన్స్ (Swipe Sense) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. ఫోన్ కొనుగోలు పై అదనంగా 2250 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది.

ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌తో ‘స్వైప్ సెన్స్’ స్మార్ట్‌ఫోన్

‘స్వైప్ సెన్స్' స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి:

ఫింగర్ ప్రింట్ స్కానర్, 5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Swipe Sense With Fingerprint Scanner, 5.5-inch Display Launched for Rs 9,999. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot