Home
Mobile

ఈ సంస్థ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఫుల్ HD+ డిస్‌ప్లే, 50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా సహా..!

ఇండ్కల్‌ టెక్నాలజీస్‌ (indkal Technologies) భారత్‌ మార్కెట్‌ లో తొలి స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేసింది. వోబుల్‌ వన్‌ పేరుతో ( Wobble One Smartphone ) స్మార్ట్‌ ఫోన్‌ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలను కలిగి ఉంది. డాల్పీ అట్మా్స్‌, డాల్బీ విజన్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇండ్కల్‌ వోబుల్‌ వన్‌ స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్లు, ధర వివరాలు.

వోబుల్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ తో విడుదల అయింది. మరియు వెనుక వైపు గ్లాస్‌ ప్యానల్‌ ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

Wobble One smartphone

ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ హైపర్‌ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ( OIS ) సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌, బొకేష్‌ లెన్స్‌ మరియు 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ముందు వైపు 32MP కెమెరాను కలిగి ఉంది. మెరుగైన కెమెరా సామర్థ్యం కోసం వోబుల్ మోడ్‌ ఫీచర్‌ ఉంటుందని తెలిపింది.

అయితే ఈ ఫోన్ ఎంత బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 47 గంటల బ్యాటరీ లైఫ్‌ లేదా 24 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ ను పొందుతుందని సంస్థ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ 7.8mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది.

వోబుల్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,000 గా ఉంటుంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్స్ ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

వోబుల్‌ వన్‌ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ డిసెంబర్‌ 12 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఒడిస్సీ బ్లూ, మిథిక్‌ వైట్‌, ఎక్లిప్స్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ ఫోన్‌ ధర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Wobble One smartphone with mediatek dimensity 7400 chip, 50MP sony camera launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X