Home
Mobile

షాపింగ్‌ చేస్తుండగా జేబులోనుంచి భగభగ మంటలు.. ఫోన్ బాంబులా పేలడంతో మహిళకు తీవ్ర గాయాలు..

Phone explosion: గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్లు చేతి బాంబుల్లా మారుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ పేలుతాయో తెలియని పరిస్థితి. ఇలా ఫోన్లు పేలిపోవడం వల్ల చాలా మంది తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా బ్రెజిల్‌లోని అనపోలిస్‌లో షాపింగ్‌కు వెళ్లిన ఓ మహిళ జేబులో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి.

ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో షాపింగ్ చేస్తున్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఆ షాకింగ్ దృశ్యాలు సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన శనివారం (ఫిబ్రవరి 8వ తేదీ) గోయానియాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దుకాణంలో జరిగింది.

Woman Phone explosion Turns Pocket Inferno in Shocking Shopping Blast

బాధితురాలి భర్త మాటియస్ సోరెస్ లిమా తెలిపిన వివరాల ప్రకారం.. వాళ్లిద్దరూ కలిసి షాపులో వస్తువులు చూస్తుండగా, ఒక్కసారిగా తన భార్య వెనుక జేబులో వేడి పెరిగిందని చెప్పింది. ఆమె తేరుకునేలోపే ఫోన్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించాయి. ఆమె వెంటనే భయంతో పరుగులు తీసింది.

చుట్టుపక్కల ఉన్నవాళ్లు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ డాక్టర్లు ఆమెకు ఫస్ట్ , సెకండ్ డిగ్రీ కాలిన గాయాలకు చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ ఈ సంఘటన చాలామందిలో ఆందోళనలను రేకెత్తిస్తోంది.

* ఏ ఫోన్ పేలింది

పేలిన ఫోన్ మోటో E32 మోడల్ అని తెలిసింది. దీన్ని సుమారు ఏడాది క్రితం కొనుగోలు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తయారీ సంస్థ మోటరోలా వెల్లడించింది. తమ ఉత్పత్తులు వినియోగదారులకు చేరే ముందు కఠినమైన భద్రతా పరీక్షల ద్వారా వెళ్తాయని కంపెనీ తెలిపింది.

* ఫోన్లు ఎందుకు పేలుతాయి

సాధారణంగా ఫోన్లు పేలడానికి బ్యాటరీ సమస్యలే ప్రధాన కారణం. చాలా స్మార్ట్‌ఫోన్‌లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి దెబ్బతిన్నా లేదా సరిగ్గా ఉపయోగించకపోయినా వేడెక్కి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఫోన్ పేలుళ్లకు కొన్ని కామన్ రీజన్స్ తెలుసుకుందాం. ఫోన్ ఎక్కువగా వాడినా లేదా వేడి వాతావరణంలో ఎక్కువగా ఉంచినా వేడెక్కడం జరుగుతుంది.

తక్కువ నాణ్యత లేదా నకిలీ బ్యాటరీలు వాడితే ప్రమాదం పెరుగుతుంది. కంపెనీ తయారు చేసిన అసలైన ఛార్జర్‌లు కాకుండా వేరేవి ఉపయోగించడం వల్ల బ్యాటరీ దెబ్బతిని వేడెక్కే ఛాన్స్ ఉంది. ఫోన్ కింద పడినా లేదా ఎక్కువ ఒత్తిడి కలిగినా బ్యాటరీ బలహీనపడి లోపల సమస్యలు వస్తాయి.

చివరగా, ఫోన్ 100% ఛార్జ్ అయ్యాక కూడా ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రిపూట చార్జింగ్ పెట్టి ఫోన్లను అలాగే వదిలేయవద్దు.

* ఫోన్ పేలుళ్లను ఎలా నివారించాలి

బ్యాటరీ పాడవకుండా ఉండాలంటే ఫోన్‌కు కంపెనీ ఇచ్చిన అసలైన ఛార్జర్‌నే వాడాలి. దిండ్లు లేదా పరుపుల వంటి మెత్తటి ప్రదేశాలపై ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదు. ఎందుకంటే అవి వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. ఫోన్లను ఎప్పుడూ వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచాలి, అంటే ఎండలో లేదా వేడిగా ఉండే కార్లలో పెట్టకూడదు.

ముఖ్యంగా గేమ్స్ ఆడుతూ లేదా వీడియోలు చూస్తూ ఛార్జింగ్ పెట్టడం ప్రమాదకరం. ఒకవేళ ఫోన్ బాగా వేడెక్కితే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. అంతేకాదు, ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల భద్రతా సమస్యలు, బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుంది.

* ఇప్పుడు ఏం జరగబోతోంది..

ఈ ఫోన్ ఎందుకు పేలిందో తెలుసుకోవడానికి మోటరోలా కంపెనీ విచారణ ప్రారంభించింది. డ్యామేజ్ అయిన ఫోన్‌ను తమ టీమ్ పరిశీలిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఫోన్లు పేలడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు బ్యాటరీ పేలుళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల కంపెనీ భారీగా నష్టపోయింది.

* బ్యాటరీ సమస్యలకు సంకేతాలు

ఫోన్‌ బాగా వేడెక్కుతుంటే, ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు.. ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లు కనిపిస్తే... మంట వాసన వస్తుంటే బ్యాటరీలో సమస్య ఉన్నట్లు గుర్తించాలి. బ్యాటరీ నుంచి హిస్సింగ్ లేదా పాపింగ్ శబ్దాలు వస్తుంటే. ఫోన్ కారణం లేకుండా పదే పదే స్విచ్ ఆఫ్ అవుతుంటే అది పాడైనట్లు అర్థం.

More from GizBot

Best Mobiles in India

English summary
Woman phone exploded in Brazil, causing burns. Battery issue suspected. Explosions caused by overheating, faulty batteries, overcharging. Use original chargers, avoid heat.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X