మొబైల్ ఫోన్‌లతో ప్రమాదం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ

Posted By:

మొబైల్ ఫోన్‌లతో ప్రమాదం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ

మొబైల్ ఫోన్‌ల వినియోగం వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్) మరో మారు స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్‌లు మనుషుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నాయా లేదా అన్న అంశం పై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక అధ్యయనాలే చోటు చేసుకున్నాయి. వీటిలో అనేక అధ్యయనాల ప్రకారం సెల్‌ఫోన్‌ల నుంచి మనుషులు ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని డబ్ల్యూహెచ్‌ఓ తన తాజా నివేదికలో వెల్లడించింది.

మొబైల్ ఫోన్‌తో గడపటం వల్ల క్యాన్సర్ వస్తుందంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో నెలకున్న భయాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటనను జారీ చేసింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగంగా 690 కోట్ల మొబైల్ ఫోన్‌లు వినయోగంలో ఉన్నాయని తన నివేదికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే రేడియేషన్‌ల వల్ల శరీర కణజాలం వేడెక్కుతన్నప్పటికి, మెదడు ఇంకా ఇతర శరీర అవయువాల పై చెడు‌ప్రభావం చూపేంత స్థాయిలో రేడియేషన్ పౌనఃపున్యాలు ఉండవని డబ్ల్యూహెచ్ స్పష్టం చేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
World Health Organisation Reassures on Health Impact of Mobile Phones. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot