Blockchain టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్, ఫాక్స్‌కాన్ కంపెనీ సహకారంతో ఓ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది.

|

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్, ఫాక్స్‌కాన్ కంపెనీ సహకారంతో ఓ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. 'ఫిన్నె' (Finney) పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా రన్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ యూజర్ల కోసం ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం తయారీ ప్రాసెస్‌లో ఉన్న ఈ ఫోన్‌కు సంబంధించి డ్యుయల్ - స్ర్కీన్ డిజైన్‌ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది నవంబర్‌ నాటికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందట. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డివైస్ ధర 999 డాలర్ల (షుమారుగా రూ.68,000)గా ఉండొచ్చని అంచనా.

కేంద్రం దెబ్బకి యూజర్లకి దిమ్మతిరిగే షాకిచ్చిన వాట్సప్కేంద్రం దెబ్బకి యూజర్లకి దిమ్మతిరిగే షాకిచ్చిన వాట్సప్

స్లైడర్ సేఫ్ స్ర్కీన్‌ మరో ప్రధానమైన హైలైట్..

స్లైడర్ సేఫ్ స్ర్కీన్‌ మరో ప్రధానమైన హైలైట్..

తాజాగా, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ZDNet అనే వెబ్‌సైట్ ఓ ఆసక్తికర కథనాన్ని పోస్ట్ చేస్తుంది. ఈ పోస్ట్ ప్రకారం ఫిన్నె ఫోన్ రెండు అంగుళాల స్లైడర్ సేఫ్ స్ర్కీన్‌తో రాబోతోంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా అభివృద్ధి చేసిన సిరిన్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది. ఇంట్రూజన్ ప్రొటెక్షన్ సిస్టం పేరుతో ప్రత్యేకమైన బిహేవియర్ ఆధారిత వ్యవస్థను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేస్తున్నారట.

 మరెన్నో ఆసక్తికర ఫీచర్లు..

మరెన్నో ఆసక్తికర ఫీచర్లు..

వీటితో పాటు సెక్యూర్ కమ్యూనికేషన్స్, మల్టీ-ఫాక్టర్, కోల్డ్ స్టోరేజ్ క్రిప్టో వాలెట్, ప్రొప్రైటరీ డీసెంట్రలైజిడ్ అప్లికేషన్ స్టోర్ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో పొందుపరచనున్నారు. ఈ ఫోన్ తయారీని ఉద్దేశించి సిరిన్ ల్యాబ్స్ చీఫ్ మార్కేటింగ్ ఆఫీసర్ నిమ్రాడ్ మే స్పందిస్తూ, బ్లాక్‌చెయిన్ ఎకానమీ - మాస్ మార్కెట్ మధ్య నెలకున్న గ్యాప్‌ను పూడ్చే లక్ష్యంతోనే ఫిన్నె డివైస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటే ఏంటి..?

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటే ఏంటి..?

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అనేది నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఓ విప్లవాత్మక ఆవిష్కరణ. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ విభాగంలో సెక్యూరిటీకి పెద్దపీటవేస్తూ డిజిటల్ కరెన్సీ కోసం రూపొందించబడిన ఈ సాంకేతికతను ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ వినియోగించుకోవటం జరుగుతోంది. డిజిటల్ లెడ్జర్ రూపంలో భద్రపరచబడిన సమాచార వ్యవస్థలను ఒకదానితో మరొకదానిని అనుసంధానించి, ఇంకొకరు హ్యాక్ చేయకుండా ఎన్‌క్రిప్ట్ చేయటమే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశ్యం.

బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీ కోసం అభివృద్ధి...

బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీ కోసం అభివృద్ధి...

ఈ టెక్నాలజీలో డేటాను పొందుపరిచే వారికి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను కేటాయించటం జరుగుతుంది. దీంతో వీరు మాత్రమే ఈ నెట్‌వర్క్‌లోకి ఎంటర్ కాగలగుతారు. హ్యాకర్లు ఈ నెట్‌వర్క్‌లోకి చొరబడాలని ప్రయత్నించిట్లయితే, ఈ టెక్నాలజీ రక్షణలో ఉన్న అన్ని విభాగాలకు హెచ్చరికలు వెళ్లిపోతాయి. దీంతో సెకన్ల వ్యవధిలో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ టెర్మినాలజీ ప్రకారం డేటాను సర్వర్లను 'నోడ్స్' అని, పాస్‌వర్డ్‌ను 'హాష్ కీ' అని పిలుస్తారు. బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీ కోసం అభివృద్ధి చేయబడిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీని జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు దుబాయ్, స్విడెన్, హోండురస్ వంటి దేశాలు ఇప్పటికే వినియోగించుకుంటున్నాయి.

Best Mobiles in India

English summary
Swiss consumer electronics company Sirin Labs has reportedly finalised a dual-screen design for its Blockchain-based "Finney" smartphone in partnership with handset manufacturer Foxconn.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X