అందుబాటులోకి ప్రపంచపు మొట్టమొదటి బ్రెయిలీ ఫోన్

Posted By:

లండన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఓన్‌ఫోన్ (OwnFone) ప్రపంచపు మొట్టమొదటి బ్రెయిలీ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్‌ను ప్రత్యేకించి అంధుల కోసం రూపకల్పన చేసారు. ఈ మొబైల్ ఫోన్‌ను వినియోగించటం ద్వారా అంధులు తమ కుటుంబ సభ్యులు ఇంకా ఆత్మీయులకు సులువుగా సంభాషణలు సాగించవచ్చు.

 అందుబాటులోకి ప్రపంచపు మొట్టమొదటి బ్రెయిలీ ఫోన్

ఈ డివైస్ ముందు, వెనుక భాగాల పైన 3డీ ప్రింటింగ్ కవర్లను ఏర్పాటు చేసారు. అవసరానికి తగట్టు వీటిని మార్చుకోగలిచే వెసలుబాటును కల్పించారు. బ్రెయిలీ లిపి చదవలేని అంధుల కోసం కవర్ల పై ఉబ్బెత్తు అక్షరాలను పొందుపరచవచ్చని కంపెనీ తెలిపింది. ముఖ్యమైన నెంబర్లు ఇంకా అత్యవసర నెంబర్లకు నేరుగా ఫోన్ చేసుకునేందుకు వీలుగా రెండు లేదా నాలుగు బటన్లను ఫోన్ పై ఏర్పాటు చేసుకోవచ్చని సదరు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్ లండన్‌లో అందుబాటులో ఉంది. ధర అంచనా రూ.6,000.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting