అంధుల కోసం ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ రూపకల్పన!

అంధులకు ఉపయోగపడే ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌లను ఇండియా త్వరలో ఉత్పత్తి చేయనుంది. కుంటి చూపు లేమితో భాడపడుతున్న అంధ వికలాంగుల కోసం బ్రెయిలీ స్మార్ట్‌ఫోన్‌ను సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యూబేషన్ ఇంకా ప్రోత్సాహ పారిశ్రామిక సంస్థకు చెందిన సుమిత్ దాగర్ వృద్ధి చేశారు. ఈ కంపెనీ ఐఐఎమ్ అహ్మదాబాద్ క్యాంపస్ లో ఉంది. ఈ ప్రత్యేక స్మార్ట్ ఫోన్ ద్వారా అంధులు ఈ-మెయిల్స్ ఇంకా సందేశాలను బ్రయిలీ క్రమంలో చదవగలుగుతారు. ఇందకు ప్రత్యేకమైన టచ్‌స్ర్కీన్ వ్యవస్థను ఈ హ్యాండ్‌సెట్‌లో వినియోగించారు.
ప్రపంచపు అతిచిన్ని ‘మొబైల్ ఫోన్'
ప్రపంచపు అతిచిన్నిమొబైల్ ఫోన్ ‘ఫోన్ స్ట్రాప్ 2 డబ్ల్యూఎక్స్06ఏ'(Phone Strap 2 WX06A)ను జపాన్ టెలికామ్ ఆపరేటర్ విల్‌కామ్ ఆవిష్కరించింది. బరువు 32 గ్రాములు, చుట్టుకొలత 32×70×10.7మిల్లీమీటర్లు. ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్5తో పోలిస్తే 4 రెట్లు చిన్నది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....
1 అంగుళం డిస్‌ప్లే,
ఎస్ఎంఎస్ ఇంకా ఈ-మెయిల్ సపోర్ట్,
ఆన్‌బోర్ట్ ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్,
బ్యాటరీ టాక్‌టైమ్ 2 గంటలు, స్టాండ్‌బై టైమ్ 300 గంటలు.
పింక్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.
ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








