ప్రపంచంలోని ఐదు నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్ కోసం వెదుకుతున్నారా..?, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ రేటింగ్‌ను సంపాదించుకున్న 5 సరికొత్త స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.

ప్రపంచపు చెత్త ఫోన్‌లు!

సమాచార విప్లవంలో ఓ భాగమైపోయిన మొబైల్ ఫోన్ కాలానుగుణంగా ఆధునీకత వైపు అడుగులువేస్తోంది. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌ను తాకుతోంది. ‘కొత్త వింత పాత రోత' అన్న చందానా పలు మొబైల్ ఫోన్ మోడళ్లు తమ ఉనికుని కోల్పోతున్నాయి. స్లిమ్ మోజులో పడిన ప్రపంచం పాతబడ్డ మోడళ్లను విసిరిపారేస్తోంది. ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన పది మొబైల్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా చెత్త హోదాను దక్కించుకున్నాయి. నేటితరం మొబైల్ ప్రియులకు ఈ మోడళ్లను చూస్తుంటే రోత పుడుతుందట! ఈ అసహ్యకరమైన ఫోన్‌లను చూసేందుకు క్లిక్ చేయ్యండి మరి.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోని ఐదు నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు!

1.) హువావి ఆసెండ్ పీ6 (Huawei Ascend P6):

ఈ నాజూకైన ఫోన్ మందం కేవలం 6.18మిల్లీమీటర్లు. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, గూగుల్ సరికొత్త వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది.

 

యాపిల్ ఐఫోన్ 5, Apple iPhone 5 (7.6mm):

2.) యాపిల్ ఐఫోన్ 5, Apple iPhone 5 (7.6mm):

ఈ నాజూకైన స్మార్ట్ ఫోన్ కేవలం 7.6 మిల్లీ మీటర్ల మందాన్ని కలిగి ఉంది. ఫీచర్లు: 4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). ఇతర ఫీచర్లు: నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

 

మోటరోలా రాజర్ ఎమ్ (Motorola Razr M):

3.) మోటరోలా రాజర్ ఎమ్ (Motorola Razr M):

ఈ స్మార్ట్‌ఫోన్ మందం కేవలం 8.3 మిల్లీమీటర్లు. వెడల్పాటి స్ర్కీన్, మెరుగైన బ్యాటరీ లైఫ్, యాపిల్ ఇంకా సామ్‌సంగ్‌లతో పోటిపడగల సామర్ధ్యం. ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న నాజూకైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మోటరోలా రాజర్ ఎమ్ మొదటి ఐదు స్థానాల్లో చోటును సంపాదించుకుంది.

 

సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క ఎస్ (Sony Ericsson Xperia arc S)

సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క ఎస్ (Sony Ericsson Xperia arc S):

ఈ స్లిమ్ హ్యాండ్ సెట్ మందం కేవలం 8.7 మిల్లీమీటర్లు. ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. వేగవంతమైన ప్రాసెసర్, శక్తివంతమైన మెమరీ వ్యవస్థ. నాజూకైన ఇంకా సౌకర్యవంతమైన మొబైలింగ్ ను కోరుకునే వారికి సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్ బెస్ట్ చాయిస్.

 

సామ్‌సంగ్ నోట్ 2(Samsung Note II)

సామ్‌సంగ్ నోట్ 2(Samsung Note II):

ఈ డివైజ్ మందం 8.5 మిల్లీ మీటర్లు. కొత్త తరం స్ర్కీన్ టెక్నాలజీ. అధునాత ఎస్ పెన్ సపోర్ట్. ప్రత్యేకమన ఫీచర్లు. ఈ నాజూకు శ్రేణి స్మార్ట్ డివైజ్ ను 2013, అంతర్జాతీయ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ వేదికగా సామ్ సంగ్ ఆవిష్కరించింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot