Home
Mobile

ప్రపంచంలోనే సన్నని 3D కర్వడ్‌ డిస్‌ప్లే ఫోన్‌.. సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..!

టెక్నో ఇటీవల ప్రపంచంలోనే సన్నని 3D కర్వడ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను (Tecno Pova Slim 5G Smartphone) లాంచ్‌ చేస్తామని ప్రకటన చేసింది. అందుకు అనుగుణంగా భారత్‌ మార్కెట్‌లో గురువారం కేవలం 5.95mm థిక్‌నెస్‌, 156 గ్రాముల బరువుతో టెక్నో పోవా స్లిమ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ డైనమిక్‌ మూడ్‌ లైట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

టెక్నో పోవా స్లిమ్‌ 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.19,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్‌ సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ స్కై బ్లూ, స్లిమ్‌ వైట్‌, కూల్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

world slimmest smartphone

టెక్నో పోవా స్లిమ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల (1224 x 2720 పిక్సల్స్‌) 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 4500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ స్లిమ్‌ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ టెక్నో AI అసిస్టెంట్‌ Ella ను కలిగి ఉంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా టెక్నో స్లిమ్‌ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చి ఉంది.

world slimmest smartphone

టెక్నో పోవా స్లిమ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 25 నిమిషాల్లో 50 శాతం, 55 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని టెక్నో తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్‌ఫోన్‌ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాలు మరియు పూర్తిగా నెట్‌వర్క్‌ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరియు VoWIFi, అడ్వాన్సడ్‌ 5G సపోర్టు ను కూడా కలిగి ఉంది.

AI కాల్‌ అసిస్టెంట్‌, AI రైటింగ్‌ అసిస్టెంట్‌, AI ఇమేజ్‌ ఎడిటింగ్‌, ప్రైవసీ బ్లర్రింగ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్‌ సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది. ఇన్‌బిల్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ ట్యూనింగ్‌తో సింగిల్‌ స్పీకర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
world slimmest smartphone Tecno Pova Slim 5G sale to start from september 8 via flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X