ప్రపంచంలోనే అతిచిన్న స్మార్ట్‌ఫోన్
2.4 అంగుళాల టచ్‌స్ర్కీన్‌తో...
ప్రపంచ మార్కెట్లు మొత్తం పెద్దస్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ల మీద దృష్టిసారిస్తుంటే, అమెరికాకు చెందిన పోష్ మొబైల్ (Posh Mobile) మాత్రం ప్రపంచంలోనే అతిచిన్న స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Read More : జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

‘మైక్రో ఎక్స్' (Micro X)
‘మైక్రో ఎక్స్' (Micro X) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ (Amazon) వెబ్‌సైట్‌లో లభ్యమవుతోంది. ధర 55 డాలర్లు (మన కరెన్సీలో రూ.3,564).

2.4 అంగుళాల స్ర్కీన్
కేవలం 2.4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ డివైస్‌ను ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు.

Micro X స్మార్ట్‌ఫోన్ టెక్నికల్ స్పెసిషికేషన్స్
2.4 అంగుళాల టచ్‌స్ర్కీన్,
మీడియాటెక్ డ్యుయల్ కోర్ 1.0GHz ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
VGA ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
650mAh బ్యాటరీ.

4జీ నెట్‌వర్క్ సపోర్ట్..
డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. సంవత్సరం వారంటీతో వస్తోన్న ఈ ఫోన్‌లో స్మార్ట్ మొబైలింగ్‌కు అవసరమైన అన్ని ప్రాధమిక ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications