ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

Written By:

మేక్ ఇన్ ఇండియా ఇనీషియేటివ్‌లో భాగంగా రూ.99కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నమోటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. మంగళవారం ఆ కంపెనీ సీఈఓ మాధవరెడ్డి మీడియా మందు నమోటెల్ అచ్చే దిన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. మే17 నుంచి మే 25 వరకు ఈ ఫోన్ బుకింగ్స్ Namotel.comలో అందుబాటులో ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బుకింగ్ ప్రాసెస్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా...

ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

ఈ ఫోన్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా బి మై బ్యాంకర్ డాట్ కామ్‌లో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఐడీ ఇంకా పాస్‌వర్డ్ ద్వారా

ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

అక్కడ రిజిస్టర్ అయిన వెంటనే ఓ ఐడీ ఇంకా పాస్‌వర్డ్ కేటాయించబడుతోందని కంపెనీ చెబుతోంది. సదరు ఐడీ ద్వారా లాగిన్ అయి ఆన్‌లైన్ ప్రాసెస్‌లో రూ.99ను చెల్లించాల్సి ఉంటుందట. డెలివరీ ఛార్జీలు అదనం

బీఎంబీ రెఫరెన్స్ ఐడీ

ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

నగదు చెల్లించిన వెంటనే యూజర్‌కు బీఎంబీ రెఫరెన్స్ ఐడీ అందుతుందట. ఆ ఐడీ Namotel.com సైట్లో ఫోన్ కోసం రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఫోటో ఇంకా ఆధార్ కార్డు

ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

 ఈ రిఫెరెన్స్ ఐడీ ద్వారా సైట్‌లోకి వెళ్లి యూజర్లు తమ వివరాలతో పాటు ఫోటో ఇంకా ఆధార్ కార్డును జత చేసినట్లయితే ఫోన్ బుకింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని కంపెనీ చెబుతోంది.

రూ.2,999 ఫోన్ రూ.99కే

ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

క్యాష్ ఆన్ డెలివరీ ప్రాతిపదికన విక్రయించబడుతోన్న ఈ ఫోన్ ధరను రూ.2,999 నుంచి రూ.99కు తగ్గించినట్లు నమోటెల్ వెబ్‌సైట్‌లో చూపించారు.

నమోటెల్ అచ్చె దిన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ కనెక్టువిటీ డ్యుయల్ సిమ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1325 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ప్లాస్టిక్ హౌసింగ్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
worlds Cheapest Smartphone Namotel Achhe Din just For Rupees 99. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot