స్ర్కీన్ పై గీతలా..??

Posted By: Prashanth

స్ర్కీన్ పై గీతలా..??

 

‘ఖరీదైన సెల్ ఫోన్ కొని వారం రోజులైనా కాలేదు.. పొరపాటున జారిపడింది, డిస్‌ప్లే అంతా గీతలే.. ఫోన్ స్ర్కీన్ వైపు చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటోంది.’

ఆనుకోకుండానో.. ఆజాగ్రత్త కారణంగానో సెల్‌ఫోన్ కింద పడటం సహజం. ఇలా ఫోన్ కిందపడిన సందర్భాల్ మైనర్ లేదా మేజర్ డ్యామెజి ఏర్పడుతుంటుంది. ఈ విధమైన సమస్యలను ద్ళష్టిలో ఉంచుకుని నిస్సాన్ కెంపెనీ ‘స్ర్కాచ్ షీల్డ్ ఐఫోన్ కేస్’ను డిజైన్ చేసింది. సెల్‌ఫోన్‌కు ఈ కేస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ కేస్‌లో ఫిట్ అయిన మీ ఫోన్ ఒక వేళ కిందపడినా ప్రమాదమేమి ఉండదు. ఈ తొడుగుతో ఉండే సెల్‌ఫోన్ కిందపడిన వెంటనే, ఆ కవర్ ఉపరితలం పై ఉండే ‘పాలీ రోటాక్సేన్’ అనే ప్రత్యేక ద్రవ పదార్థం పనిచేయటం ప్రారంభిస్తుంది. గీతలు, డ్యామేజి ఉన్న చోటికల్లా వెళ్లి సొంతంగా మరమ్మతులు చేస్తుంది. చేయ్యాల్సిందల్లా సెల్‌ఫోన్‌ని కదపకుండా కొన్ని గంటలు ఓ పక్కన పెట్టడమే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot