ఈ నెలలో విడుదల కానున్న నోకియా 7 కెమెరాల ఫోన్
హెచ్‌ఎండీ గ్లోబల్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ బ్రాండు నోకియా నుంచి ఈ నెలలో రానున్న స్మార్ట్‌ఫోన్ అనేక సంచలనాలకు వేదిక కాబోతుందని తెలుస్తోంది.
హెచ్‌ఎండీ గ్లోబల్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని అందించనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ బ్రాండు నోకియా నుంచి ఈ నెలలో రానున్న స్మార్ట్‌ఫోన్ అనేక సంచలనాలకు వేదిక కాబోతుందని తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి అతి త్వరలో 5 కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ అభిమానులను అలరించనుంది.పెంటా-కెమెరా సెటప్‌తో రానున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య లీక్ అయ్యి వైరల్‌గా మారాయి.

పెంటా-లెన్స్(ఐదు లెన్స్‌లు) కెమెరా
ఈ ఫోన్‌కు అతిపెద్ద బ్యాటరీతో పాటు వెనుకవైపు పెంటా-లెన్స్(ఐదు లెన్స్‌లు) కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది.

రియర్‌లో మొత్తం ఏడు రింగ్స్....
వెనుకవైపు ఐదు కెమెరాలు ఉండటమే ఈ ఫోన్ ప్రధాన విశేషం. రియర్‌లో మొత్తం ఏడు రింగ్స్ కనిపిస్తాయి. అందులో ఐదు కెమెరా లెన్సులు. ఆరో రింగ్‌లో డ్యూయెల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. ఇక ఏడో రింగ్‌లో డ్యూయల్ సెన్సార్ ఉంటుంది.

డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు...
ఇక ఈ ఫోన్‌లో ముందువైపు డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఏర్పాటు చేసారు.

4,150ఎంఏహెచ్ బ్యాటరీ....
ఈ ఫోన్‌లో 4,150ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 జనవరి చివరి నాటికి ఈ ఫోన్ లాస్ వెగాస్‌లో రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ ఫోన్‌ను..
నిజానికైతే ఇప్పటికే ఈ ఫోన్‌ను విడుదల చేయాల్సి ఉండగా. పెంటా లెన్స్ కెమెరా వల్లే ఆలస్యమైందట.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే...
5.9 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుందని తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ , 4,150 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ వంటి ఫీచర్లు ఈఫోన్లలో ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications