ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్.. ఎన్నో ప్రత్యేక ఫీచర్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 3D కర్వడ్ డిస్‌ప్లేను (Tecno pova slim 5G smartphone) కలిగి ఉన్న సన్నని తొలి స్మార్ట్‌ఫోన్ గా ఉందని టెక్నో తెలిపింది. టెక్నో పోవా స్లిమ్ 5G ఫోన్ పేరుతో లాంచ్ అయింది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సహా అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది.
అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ :
టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 5.95mm థిక్‌నెస్, 156 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది.

3D కర్వడ్ డిస్‌ప్లే :
టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ స్కై బ్లూ, స్లిమ్ వైట్, కూల్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. 55 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని సంస్థ చెబుతోంది.

ఏఐ అసిస్టెంట్ :
ప్రపంచంలోని అత్యంత సన్నని టెక్నో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ టెక్నో AI అసిస్టెంట్ Ella ను కలిగి ఉంది. మరియు సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ AI రైటింగ్ అసిస్టెంట్, AI ఇమేజ్ ఎడిటింగ్, AI కాల్ అసిస్టెంట్, ప్రైవసీ బ్లర్రింగ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఇన్‌బిల్ట్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సార్‌ను కలిగి ఉంది.

టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాలు, పూర్తిగా నెట్‌వర్క్ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు VoWIFi, అడ్వాన్సడ్ 5G సపోర్టు ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ ట్యూనింగ్‌తో సింగిల్ స్పీకర్‌తో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications