Home
Mobile

ఒప్పో రికార్డ్‌.. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధం..!

By Ram Kumar

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఒప్పో సరికొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యింది. ఇది కొన్ని పేపర్లంత సన్నని ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దాని పేరే ఒప్పో ఫైండ్ N5. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్‌గా అవతరించనుంది.

OPPO చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లౌ చెప్పిన దాని ప్రకారం, ఈ సరికొత్త ఫోన్ ఒక సాధారణ పెన్సిల్ కంటే కూడా సన్నగా ఉండబోతోంది. అంటే దాని మందం కేవలం 7-8mm మాత్రమే ఉంటుందన్నమాట. పోల్చి చూస్తే, ఇంతకు ముందు వచ్చిన Find N3 ఫోన్ ముడుచుకున్నప్పుడు ఏకంగా 11.7mm మందంతో ఉండేది.

World s Thinnest Foldable  OPPO Find N5 at What Price

డిజైన్, ఫీచర్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి OPPO ఎంతగానో కట్టుబడి ఉందో ఈ ఫోన్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది.

* సన్నగా.. మరింత పటిష్టంగా..

ఈ సరికొత్త Find N5 ఫోన్, మార్కెట్లో ఉన్న ఇతర టాప్ ఫోల్డబుల్ ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి వస్తోంది. ముఖ్యంగా, Honor Magic V3 ఫోన్ ముడుచుకున్నప్పుడు 9.2mm మందం ఉంటుంది. ఈ ఫోన్‌తో పోలిస్తే Find N5 చాలా సన్నగా ఉండబోతోంది.

అంతేకాదు, ఈ ఫోన్‌లో సరికొత్త డిజైన్‌ను ఉపయోగించారు. ఇది సన్నగా ఉండటంతో పాటు, చాలా దృఢంగా కూడా ఉంటుందట. అలాగే, ఈ ఫోన్‌కు IPX8 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండనుంది. అంటే, నీటి తుంపర్లు పడినా ఈ ఫోన్‌కు ఏమీ కాదు. దీంతో దీన్ని రఫ్ అండ్ టఫ్‌గా వాడొచ్చు.

* అదిరిపోయే కెమెరాలతో వస్తోంది..

ఈ ఫోన్‌లో హై-ఎండ్ హాసెల్‌బ్లాడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఇవ్వనున్నారని టాక్. ఇందులో అధిక జూమ్ కోసం పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంటుందట. ఈ కెమెరాలు ఫొటో క్వాలిటీలో తిరుగులేని అనుభూతిని అందిస్తాయి. దీంతో ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవాళ్లకు ఈ ఫోన్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది.

* శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా..

పనితీరు విషయంలో కూడా ఈ ఫోన్ ఏమాత్రం తీసిపోదు. ఇది అడ్వాన్స్‌డ్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రాబోతోంది. దీంతో స్పీడ్, పనితీరు విషయంలో ఇది అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.

అంతేకాదు, ఈ ఫోన్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. అంటే, సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు.

* భారీ బ్యాటరీతో వస్తోంది..

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటివరకు చూడని విధంగా భారీ 6,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వాడుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో ఛార్జింగ్ చేసుకోవడం మరింత సులభం అవుతుంది. చూడటానికి కూడా చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుందీ ఫోన్.

* ధర మాత్రం కాస్త ఎక్కువే ఉండొచ్చు

రూమర్స్ ప్రకారం, ఒప్పో ఈ Find N5 ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ ఓపెన్ 2 పేరుతో విడుదల చేయవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చైనా వెలుపల కూడా ఎక్కువ మంది వినియోగదారులకు చేరువయ్యే అవకాశం ఉంది.

దీని ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈ ఫోన్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌ను బట్టి చూస్తే, మిగతా మోడళ్ల కంటే దీని ధర కాస్త ఎక్కువే ఉండే అవకాశం ఉంది.

* టెక్ ప్రపంచం ఎదురుచూస్తోంది..

ఒప్పో Find N5.. తన సన్నని డిజైన్, పవర్ఫుల్ పనితీరు మరియు సరికొత్త ఫీచర్లతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక సంచలనం సృష్టించడం ఖాయం. ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, టెక్నాలజీని ఇష్టపడే వాళ్లంతా ఈ ఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO's Find N5 will be the world's thinnest foldable phone, surpassing its predecessor. It features a Hasselblad camera, Snapdragon 8 Elite, and a 6000mAh battery. A global release as OnePlus Open 2 is possible.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X