‘మూడ్’ వచ్చేస్తుంది!!

Posted By: Prashanth

‘మూడ్’ వచ్చేస్తుంది!!

 

దేశంలో డ్యూయల్ సిమ్ ఫోన్‌లు సర్వ సాధారణమైపోయాయి. కాస్తంత భిన్నంగా ఆలోచించిన సేజ్ (XAGE) సంస్థ ఏకంగా ట్రిపుల్ సిమ్ ఫోన్‌ను రూపొందించింది. ఎమ్228 జీల్‌గా పిలవబడుతున్న ఈ హ్యాండ్‌సెట్ జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. యూజర్లు మాన్యువల్‌గా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు.

ఫోన్ ఇతర ఫీచర్లు:

2.2 అంగుళాల కలర్ స్ర్కీన్,

1.3మెగా పిక్సల్ కెమెరా,

2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 12 గంటలు),

మైక్రో ఎస్డీ‌కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 8జీబి వరకు పెంచుకోవచ్చు.

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఎఫ్ఎమ్ రేడియో ప్రపంచంతో మిమ్మల్ని కనెక్ట్ చేసి ఉంచుతుంది. ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా 1280 x 960 రిసల్యూషన్‌తో కూడిన ఫోటోలు, వీడియోలను చిత్రీకరిస్తుంది. బ్లూటూత్ కనెక్టువిటీ సౌలభ్యతతో డేటాను వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించే విధంగా ఫేస్‌బుక్, స్కైప్, యాహూ మెసెంజర్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ఇన్-బుల్ట్ చేశారు. మల్టీపుల్ లాంగ్వేజ్, మొబైల్ ట్రాకర్, మోషన్ సెన్సార్, ఎల్‌ఈడి టార్చ్‌లైట్ తదితర ఫీచర్లు యూజర్‌కు మరింత లబ్ధి చేకూరుస్తాయి. సిల్వర్ బ్లాక్, రెడ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో హ్యాండ్‌సెట్ లభ్యమవుతోంది. ధర రూ.3915.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting