ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ 60 రోజులు?

Posted By: Super

ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ 60 రోజులు?

దేశీయ మొబైల్ తయారీ సంస్థ సేజ్ కమ్యూనికేషన్, సరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్ ఆవిష్కరణకు సంబంధించి ఓ ప్రకటనను వెలువరించింది. ఈ బ్రాండ్ నుంచి తాజాగా విడుదల కాబోతున్న హ్యాండ్‌సెట్ పరు ‘సేజ్ ఎమ్900 ఫోర్స్’. ఈ మొబైల్‌లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన 3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ 60రోజుల సుధీర్ఘ స్టాండ్‌బై నిస్తుంది. ఈ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్ 2.8 అంగుళాల పటిష్టమైన డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్ సులువైన టైపింగ్‌కు తోడ్పడుతుంది.

ఫోన్ కీలక ఫీచర్లు:

2.8 అంగుళాల డిస్‌ప్లే,

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

ఎల్ఈడి టార్చ్,

వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో,

బ్లూటూత్ ఏ2డిపి వర్షన్,

ఫోన్ మెమరీని 16జీబికి పెంచుకునేందుకుగాను మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

60 రోజుల స్టాండ్‌బై నిచ్చే 3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర, వారంటీ:

వైట్-బ్లూ, బ్లాక్-ఎల్లో, బ్లాక్-రెడ్ కలర్ వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ‘సేజ్ ఎమ్900’ దేశ వ్యాప్తంగా ఉన్న సేజ్ (Xage) రిటైల్ స్టోర్‌లలో లభ్యం కానుంది. సంవత్సరం వారంటీతో కూడిన ఆఫర్‌తో డివైజ్‌ను రూ.2,599కు సొంతం చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot