జియోమీ పవర్ బ్యాంక్‌లు వచ్చేసాయ్!

Posted By:

చైనా ‘యాపిల్'గా ప్రసిద్థిగాంచిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ.. రెండు శక్తవంతమైన పవర్ బ్యాంక్‌లను ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. 10400 ఎమ్ఏహెచ్, 5200 ఎమ్ఏహెచ్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ రెండు పవర్ బ్యాంక్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్  (Flipkart) తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. 10400 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల పవర్ బ్యాంక్ ధర రూ.999, 5200 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల పవర్ బ్యాంక్ ధర రూ.799.

 జియోమీ పవర్ బ్యాంక్‌లు వచ్చేసాయ్!

ఈ ఎమ్ఐ శ్రేణి పవర్ బ్యాంక్‌లపై అల్యూమినియమ్ కేసింగ్‌లను ఏర్పాటు చేసారు. మెటాలిక్ ఫినిష్ పవర్ బ్యాంక్‌లను చమ్మ ఇంకా తప్పు నుంచి కాపాడుతుంది. ఈ పవర్ బ్యాంక్‌లతో ఎమ్ఐ 3 స్మార్ట్‌ఫోన్‌లను 2.5 సార్లు పూర్తిగా, ఐఫోన్ 5ఎస్‌ను 4.5 సార్లు పూర్తిగా, ఐప్యాడ్ మినీని 1.5 సార్లు పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

భారత్ మార్కెట్లో అనూహ్యమైన ఫలితాలను రాబడుతోన్న జియోమీ త్వరలో రెడ్ మై 1ఎస్, రెడ్‌మై నోట్ మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot