108MP క్వాలిటీతో Xiaomi నుంచి స‌రికొత్త మొబైల్ రానుందా?

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ షావోమీ స‌రికొత్త మోడ‌ల్ మొబైల్స్ ను విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. షావోమీ 12 సిరీస్‌లో భాగంగా ప‌లు మోడ‌ల్స్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మీడియా వ‌ర్గాల స‌మాచారం. ఆ జాబితాలో Xiaomi 12 Ultra 5G, Xiaomi 12T, మ‌రియు Xiaomi 12S మోడ‌ల్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీటితో పాటు Xiaomi 12 Lite 5G కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఈ Xiaomi 12 Lite 5G కి సంబంధించిన డిజైన్ వివ‌రాలు ఆన్‌లైన్ లో లీక‌య్యాయి. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన లీక్డ్ వివ‌రాల‌ను గురించి తెలుసుకుందాం.

Xiaomi 12 Lite 5G

సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైన వీడియో ప్ర‌కారం టిప్‌స్ట‌ర్ ద్వారా ప‌లు వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. Xiaomi 12 Lite 5G మొబైల్ పింక్ క‌ల‌ర్ లో పంచ్ హోల్ డిస్‌ప్లే క‌లిగి ఉంది. అంతేకాకుండా ఇది ఫ్లాట్ ఎడ్జ్‌ల‌ను క‌లిగి ఉంది. దీనికి డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ అందిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఫోన్‌కు కుడి వైపున వాల్యూమ్ మ‌రియు ప‌వ‌ర్ బ‌ట‌న్స్ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. కింది వైపున స్పీక‌ర్, మైక్రోఫోన్, యూఎస్‌బీ-సీ పోర్ట్ క‌లిగి ఉన్న‌ట్లు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన వీడియో ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా ఫీచ‌ర్ క‌లిగి ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఫోన్‌కు 108 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.

Xiaomi 12 Lite 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.55 అంగుళాల AMOLED display with an FHD+ resolution డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. Snapdragon 778G ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 108 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 108 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌తో మ‌రొక కెమెరా, 5 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో షూట‌ర్ లెన్స్ తో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ భార‌త్‌లో కూడా త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం. అయితే విడుద‌ల‌కు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా వెలువ‌డ‌లేదు.

Xiaomi 12 Lite 5G

కాగా, ఛార్జింగ్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే భార‌త మార్కెట్లో Xiaomi 11i హైప‌ర్ ఛార్జ్‌ అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను గురించి తెలుసుకుందాం:

Xiaomi 11i హైప‌ర్ ఛార్జ్‌ స్మార్ట్‌ఫోన్ వేగ‌వంత‌మైన ఛార్జింగ్ ఫీచ‌ర్ ను క‌లిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4500mAh బ్యాటరీతో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది MediaTek Dimensity 920 SoC ద్వారా ర‌న్ అవుతుంది. మొబైల్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 108MP క్వాలిటీతో, భార‌త్లో ఈ Xiaomi 11i మొబైల్ ధ‌ర రూ.26,999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi 12 Lite 5G Leaked Renders Reveal Design

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X