Just In
- 17 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 20 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 22 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- 24 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- Finance
Budget Market: మార్కెట్ పెరుగుతుందా.. పడిపోతుందా..? గత బడ్జెట్లలో ఏం జరిగిందంటే..
- News
ఏపీలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ? టీడీపీ ఆరోపణల్ని నిర్దారించిన వైసీపీ ఎమ్మెల్యే !
- Movies
Taraka Ratna: తారకరత్న పరిస్థితిపై చిరంజీవి ట్వీట్.. వాళ్లకు థ్యాంక్స్ అంటూ!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Xiaomi నుంచి ఆకర్షణీయమైన ఫీచర్లతో Xiaomi 12 Lite 5G రాబోతోంది!
Xiaomi కంపెనీ నుంచి Xiaomi 12 Lite 5G స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ మొబైల్‌కు సంబంధించి షియోమీ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. అంతేకాకుండా, Xiaomi 12 Lite 5G మొబైల్‌కు సంబంధించి రంగు వేరియంట్లు కంపెనీ నుంచి అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ మేరకు షియోమీ కంపెనీ ట్విటర్ వేదికగా వెల్లడించింది.

నాలుగు కలర్ వేరియంట్లలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి!
Xiaomi ట్విటర్ వేదికగా వెల్లడించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. Xiaomi 12 Lite 5G స్మార్ట్‌ఫోన్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రాబోతుంది. వాటిలో గ్రీన్, పర్పుల్, పింక్, సిల్వర్ కలర్ వేరియంట్లు ఉండనున్నాయి. అంతేకాకుండా "featherweight slim design" ఫీచర్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక స్మార్ట్ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
Xiaomi 12 Lite 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
షియోమీ కంపెనీ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా Xiaomi 12 Lite 5G మొబైల్‌కు సంబంధించి ప్రీ ఆర్డర్‌లను కొద్ది రోజుల కిందట ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రీ ఆర్డర్ లిస్టింగ్ అనధికారికంగా Xiaomi 12 Lite 5G మొబైల్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వెల్లడించింది. అనధికారికంగా విడుదలైన ప్రీఆర్డర్ లిస్టింగ్ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ ఫీచర్‌తో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా దీనికి బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇక ఈ హ్యాండ్‌సెట్‌కు రైట్ సైడ్‌లో పవర్ బటన్, వాల్యూమ్ బటన్ అందిస్తున్నారు.

ఈ మొబైల్ కు 6.55 అంగుళాల full-HD, OLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. octa-core Qualcomm Snapdragon 778+ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ కు హోల్ పంచ్ డిజైన్డ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. ఇది 8జీబీ ర్యామ్|128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 108 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 108 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌తో మరొక కెమెరా, 2 మెగా పిక్సల్ క్వాలిటీతో మాక్రో షూటర్ లెన్స్ తో మూడో కెమెరాను ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4300mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi dual-band, Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వర్శన్ 5 కలిగి ఉంది.
ఈ మొబైల్‌కు డిస్‌ప్లే కింది భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను ఇస్తున్నారు. ఫీచర్లను బట్టి చూస్తే ఈ మొబైల్ ధర భారత మార్కెట్లో రూ.30 వేల వరకు ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనాలను బట్టి తెలుస్తోంది. ఇది గ్రీన్, పింక్, సిల్వర్, పర్పుల్ కలర్లలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న Xiaomi 12S Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.73 అంగుళాల full-HD, AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. Qualcomm SM8450 Snapdragon 8+ Gen 1 (4 nm) ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్|12 జీబీ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సల్ క్వాలిటీ గల కెమెరా సౌకర్యం కల్పించారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 4600mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi dual-band, Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వర్శన్ 5 కలిగి ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి కలిగిన వారు అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470