Home
Mobile

మళ్ళీ ధర తగ్గింది! ఈ షియోమీ ఫోన్ పై రూ.10000 తగ్గింపు! కొత్త ధర వివరాలు

By Maheswara

ఈ సంవత్సరం 2023 ప్రారంభంలో, Xiaomi తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, Xiaomi 13 Proని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్, లాంచ్ చేసిన వెంటనే దీని ముందు తరం ఫోన్ పై రూ.8000 ధర తగ్గించారు. ఇప్పుడు మళ్లీ రెండవసారి కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ Xiaomi 12 Pro పై ధర తగ్గింపును ప్రకటించారు.ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

ఈసారి Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ పై రూ.10 వేల భారీ ధర తగ్గింపును ప్రకటించారు. ఆసక్తికరంగా, షియోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ మొత్తం 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది మరియు రెండు ఫోన్లు కూడా ఈ రెండవ ధర తగ్గింపు ను అందుకున్నాయి. ఈ రెండుసార్లు ధర తగ్గింపు తో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అసలు ధరపై మొత్తం రూ.18,000 ధర తగ్గిందని తెలుస్తోంది.

Xiaomi 12 Pro Price Cut Announced Second Time This Year, New Price And Offers Details Here.

షియోమీ 12 ప్రో కొత్త ధర వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ 8GB + 256GB మరియు 12GB + 256GB యొక్క 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో వరుసగా రూ. 62,999 మరియు రూ. 66,999 ధర వద్ద లాంచ్ చేయబడింది. ఈ సంవత్సరం మొదట్లో మొదటిసారి ధర రూ.8,000 తగ్గింపు తర్వాత, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB వేరియంట్ ధర రూ.54,999కి మరియు 12GB వేరియంట్ ధర రూ.58,999కి ధర తగ్గింది.

అయితే ఇప్పుడు, ఈ ధర పై మళ్ళీ రెండవ సారి ధర రూ.10,000 తగ్గింది,ఈ తగ్గింపు కారణంగా 8GB RAM ఫోన్ ధర రూ.44,999కి మరియు 12GB RAM ఫోన్ ధర రూ.48,999కి అందుబాటులో ఉంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, షియోమీ 12 ప్రో మోడల్ నోయిర్ బ్లాక్, ఒపెరా మావ్ మరియు కోచర్ బ్లూ అనే 3 రంగుల ఆప్షన్లలో సేల్ చేయబడుతుంది.

షియోమీ 12 ప్రో ఫీచర్లు: ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల WQHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 SoC ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 12GB RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

షియోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా MIUI 13ని నడుపుతుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ మరియు హర్మాన్ కార్డాన్ క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌తో వస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్, 50 MP సోనీ IMX707 వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా + 50 MP టెలిఫోటో కెమెరా + 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఇక ముందు వైపు విషయానికి వస్తే, ఇది 32 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఇది 4600mAh బ్యాటరీతో వస్తుంది.

దీని బ్యాటరీ 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ తో, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ సాధారణ మోడ్ లో ఉన్నప్పుడు, పూర్తి ఛార్జింగ్ దాదాపు 24 నిమిషాలు పడుతుంది. ఇంకా, బూస్ట్ మోడ్‌లో కేవలం 18 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని షియోమీ ప్రకటించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 12 Pro Price Cut Announced Second Time This Year, New Price And Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X