భార‌త్‌లో అత్యంత ఖ‌రీదైన Xiaomi మొబైల్‌ ఇదే.. ధ‌ర తెలిస్తే షాకే!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Xiaomi నుంచి గ‌తంలో భారతదేశంలో మొబైల్స్ త‌క్కువ ధ‌ర‌కు విడుద‌ల‌య్యేవి. కానీ, ప్ర‌స్తుతం వాటి ధ‌ర‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లో Xiaomi 12 ప్రో మోడ‌ల్‌ ఆ కంపెనీ నుండి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ గా ఉంది. కాగా, త్వరలో విడుద‌ల‌య్యే Xiaomi 12S అల్ట్రా మొబైల్‌తో Xiaomi 12 ప్రో ఆ జాబితా నుంచి కాస్త కిందికి దిగ‌జార‌నుంది

Xiaomi 12S Ultra

Xiaomi 12S అల్ట్రా ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సామర్థ్యం గల నాన్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ గా విడుద‌ల కానుంది. ఇది 1-ఇంచ్‌ ప్రైమరీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్ మరియు 100x జూమ్ (హైబ్రిడ్) సపోర్ట్ వంటి అద్భుత‌మైన ఫీచర్లతో విడుద‌ల కానుంది. కంపెనీ నుండి Xiaomi 12S అల్ట్రా ప్రీమియం మరియు అధునాతనమైనది, కాబ‌ట్టి భారతదేశంలో Xiaomi 12 Pro కంటే దీని ధర అత్య‌ధికంగా ఉంటుందని తెలుస్తోంది.

చైనాలో, ఈ Xiaomi 12S అల్ట్రా మోడ‌ల్ కు సంబంధించి 8GB RAM మరియు 256GB నిల్వ క‌లిగిన‌ బేస్ మోడల్ ధర 5,999 యువాన్ (భారత క‌రెన్సీలో రూ. 70,435) గా నిర్ణ‌యించారు. Xiaomi 12S అల్ట్రాను భారతదేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందున, పరికరం ధర రూ.75,000తో ఇది అత్యంత ఖరీదైన Xiaomi స్మార్ట్‌ఫోన్‌గా నిల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Xiaomi 12S అల్ట్రా భారతదేశానికి వస్తుందా?
Xiaomi 12S Ultra ఊహించిన దాని కంటే త్వరగా భారతదేశానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలో Xiaomi 12S అల్ట్రా లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఇప్ప‌టికే టీజ్ చేయ‌డం ప్రారంభించింది. మరియు బ్రాండ్ ఆఫ్‌లైన్ లాంచ్ పార్టీని కూడా నిర్వహించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 2022 చివరి నాటికి ఈ డివైజ్‌ను లాంచ్ చేయవచ్చని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కంపెనీ భారతదేశంలో Xiaomi 12S అల్ట్రాతో పాటుగా మరికొన్ని డివైజ్‌ల‌ను కూడా ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి.

Xiaomi 12S Ultra

Xiaomi 12S అల్ట్రా గొప్ప హార్డ్‌వేర్ సామర్థ్యాలతో వ‌స్తోంది. దీనికి బ్యాక్ సైడ్‌ కెమెరా బంప్ అందిస్తున్నారు. 1-ఇంచ్ సైజులో సోనీ సెన్సార్‌తో భారతదేశంలో అధికారికంగా ప్రారంభించే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. Samsung మరియు Apple వంటి బ్రాండ్‌ల నుండి హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పోల్చినప్పుడు కూడా Xiaomi 12S అల్ట్రా మెరుగైన కెమెరా పనితీరును అందిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు.

Xiaomi 12S Ultra లీక్‌డ్ స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్‌కు సంబంధించి లీకైన స్పెసిఫికేష‌న్ల‌ను చూస్తే.. 6.73 అంగుళాల full-HD + E5 AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8 Plus Gen 1 chip ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 12జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని క‌లిగి ఉంది. ఇది MIUI 13 ఆధారిత‌ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారంతో ప‌నిచేస్తుంది.

Xiaomi 12S Ultra

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో f/1.9 అప‌ర్చ‌ర్ వైడ్ యాంగిల్ లెన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండు కెమెరాల్లో ఒక‌టి 48 మెగాపిక్సెల్ క్వాలిటీలో f/2.2 అప‌ర్చ‌ర్ (అల్ట్రా వైడ్ లెన్స్‌), మ‌రొక‌టి 48 మెగాపిక్సెల్ క్వాలిటీ (టెలిఫోటో లెన్స్‌)ని క‌లిగి ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,860 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. 67W వైర్‌డ్ మ‌రియు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. అంతేకాకుండా, డాల్బీ అట్మాస్ ఫీచ‌ర్‌తో పాటు, IP68 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్ కూడా క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

Best Mobiles in India

English summary
Xiaomi 12S Ultra With 1-Inch Camera Could Be The Most Expensive Xiaomi Smartphone In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X