Home
Mobile

50MP+ 50MP+ 12MP కెమెరాలు, 12GB ర్యామ్‌తో లిమిటెడ్‌ ఎడిషన్ ఫోన్‌ విడుదల.. ధర, సేల్‌ వివరాలు..!

షియోమీ ఇవాళ భారత్‌ మార్కెట్లో స్మార్ట్‌ ఫోన్ సహా రెండు ట్యాబ్లెట్‌ లను విడుదల చేసింది. తాజాగా షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్‌ (Xiaomi 14 Civi 5G Limited Edition) స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ టోన్ పాండా డిజైన్‌ తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు మిర్రర్‌ గ్లాస్‌ మరియు వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G మరియు రెడ్‌మి ప్యాడ్ SE 4G ట్యాబ్లెట్‌లను విడుదల చేసింది.

షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.55 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో లాంచ్ అయింది. డాల్బీ విజన్‌, HDR10+ ను సపోర్టు చేస్తుంది. మరియు గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను కలిగి ఉంటుంది.

Xiaomi 14 Civi 5G Limited edition Smartphone launched in india

ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB LPDDR5X ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మెరుగైన నెట్‌వర్క్ కవరేజీ కోసం T1 చిప్‌ను కలిగి ఉంటుంది. మరియు IceLoop కూలింగ్ సిస్టమ్‌ పైన పనిచేస్తుంది.

ఈ షియోమీ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలు కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP లైట్‌ ఫ్యూజన్‌ 800 ఇమేజ్‌ సెన్సార్‌, 2X జూమింగ్‌ సామర్థ్యంతో 50MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఈ హ్యాండ్‌సెట్‌ 67W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ బ్లూటూత్‌ 5.4, వైఫై 6, 5G, NFC, GPS, Glonass సహా USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

షియోమీ 14 సివీ లిమిటెడ్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర :
షియోమీ 14 సివీ లిమిటెడ్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే ర్యామ్‌, స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో రూ.48,999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్చేంజీ బోనస్‌ ద్వారా రూ.3000 ధర తగ్గుతుంది.

ఈ షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్‌ హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అయింది. షియోమీ అధికారిక వెబ్‌సైట్‌, షియోటీ రిటైల్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో లభిస్తుంది. పాండా వైట్‌, హాట్‌ పింక్‌, ఆక్వా బ్లూ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 14 Civi 5G Limited edition Smartphone launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X