Home
Mobile

డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌, 50MP కెమెరాతో షియోమీ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఫోన్.. విడుదల తేదీ వెల్లడి..!

షియోమీ నుంచి త్వరలో లిమిటెడ్ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్ కానుంది. తాజాగా ఈ హ్యాండ్‌ సెట్‌ గురించి సంస్థ టీజర్‌ ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ షియోమీ 14 సివీ లిమిటెడ్ ఎడిషన్‌ (Xiaomi 14 Civi Limited Edition Smartphone) ప్రస్తుతం అందుబాటులో ఉన్న షియోమీ 14 సివీ స్టాండర్డ్‌ వేరియంట్‌ తరహా ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్టాండర్డ్‌ వెర్షన్ భారత్‌లో జూన్‌లో విడుదల అయింది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ ను కలిగి ఉంటుంది.

ఈ షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న షియోమీ సివీ 4 ప్రో హ్యాండ్‌సెట్‌ కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ జులై 29న భారత్‌లో విడుదల కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ Panda డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

Xiaomi 14 CIvi Limited Edition Smartphone

ఈ షియోమీ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ డ్యూయల్ టోన్‌ ఫినిష్‌ ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌ సెట్‌ బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్ గ్లాస్‌ మరియు వేగాన్‌ లెదర్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ బ్లూ, పింక్‌, వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ ఆకట్టుకొనే విధంగా ఉంది.

షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్‌ వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్ వెనుక వైపు 50MP Leica కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ముందువైపు రెండు 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1.5k రిజల్యూషన్‌తో క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే HDR10+ సహా డాల్బీ విజన్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 67W వైర్‌ టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ షియోమీ 14 సివీ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR5X ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్‌ స్టోరేజీ వేరియంట్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

షియోమీ 14 సివీ స్టాండర్డ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.42,999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.47,999 గా ఉంది. అయితే లిమిటెడ్‌ ఎడిషన్ వేరియంట్ ధరలను సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 14 CIvi Limited Edition Smartphone launch confirmed in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X