Xiaomi 14 మూడు 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
షియోమీ 14 స్మార్ట్ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా (Xiaomi 14 Smartphone) లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ సహా ట్రిపుల్ 50MP కెమెరాలు, 90W హైపర్ ఛార్జింగ్‌తో వస్తుంది. LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz డైనమిక్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ 6.36 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 460ppi పిక్సల్ డెన్సిటీ, 1Hz నుంచి 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది.

షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్‌సెట్ 12GB LPDDR5 ర్యామ్, 512GB UFS 4,0 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 193 గ్రాముల బరువు ఉంటుంది.
షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ Leica బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Summilux లెన్స్‌ను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు f/1.6 అపేచర్‌తో 50MP కెమెరా, 75mm ఫ్లోటింగ్ లెన్స్ టెక్నాలజీతో కూడిన 50MP టెలిఫోటో కెమెరా, 115 డిగ్రీ ఫీల్డ్ వ్యూ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది.

ఈ షియోమీ 14 స్మార్ట్ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా స్పెసిఫికేషన్లలో ఈ ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అయింది. ఫలితంగా నాణ్యమైన ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు.
కనెక్టివిటి పరంగా ఈ షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ 5G, వైఫై 7, NFC, బ్లూటూత్ 5.4, GPS, గెలిలియో, NaVlC, Glonass, సహా USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉంది. మరియు యాక్సిలిరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, లీనియర్ మోటార్, IR బ్లాస్టర్, ఫ్లిక్కర్ సెన్సార్, కలర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ షియోమీ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ షియోమీ కొత్త హ్యాండ్‌సెట్ 90W వైరడ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4610mAh ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 90W ఛార్జర్ హైపర్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 31 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు.
షియోమీ 14 ధర, లభ్యత : ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌తో వస్తుంది. మరియు బ్లాక్, జాడే గ్రీన్, వైట్ రంగుల్లో లభిస్తుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.75000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో మార్చి 7 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ వెర్షన్ మాదిరిగా స్పెసిఫికేషన్లతో వస్తుంది.


Click it and Unblock the Notifications








