ట్రిపుల్ 50MP కెమెరాలు, 12GB ర్యామ్‌తో షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఈ కార్డులపై రూ.5000 డిస్కౌంట్..!
షియోమీ సంస్థ భారత్ మార్కెట్‌లో షియోమీ 14 స్మార్ట్‌ఫోన్‌ను (Xiaomi 14 Smartphone) విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.36 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో రక్షణను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ జాడె గ్రీన్, మ్యాటీ బ్లాక్, క్లాసిక్ వైట్ రంగుల్లో లభిస్తుంది.
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, హైపర్OS : ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్.. అడెన్నో 750 చిప్‌సెట్‌తో జతచేయబడుతుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS అవుట్ ఆఫ్ ది బాక్స్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

మూడు 50MP కెమెరాలు : ఈ షియోమీ 14.. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP లైట్ ఫ్యూజన్ 900 ప్రైమరీ కెమెరా, 50MP టెలీఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను అమర్చారు.
90W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు : ఈ షియోమీ కొత్త ఫోన్ 90W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4610mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 7, బ్లూటూత్ 5.4ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు : ఈ షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది. ఈ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మార్చి 11 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. షియోమీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ బ్యాంకు కార్డుల ద్వారా రూ.5000 తగ్గింపు : లాంచ్ సందర్భంగా షియోమీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక డిస్కౌంట్‌లను ప్రకటించింది. ICICI డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 తక్షణ డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఎక్స్టేంజీ ద్వారా మరో రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఫోన్‌ను రూ.59,999 కే కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








