Home
Mobile

మూడు 50MP కెమెరాలు, 12GB ర్యామ్‌తో షియోమీ ఫోన్‌.. సేల్‌ ప్రారంభం.. రూ.5000 తగ్గింపు..!

షియోమీ ఇటీవల భారత్‌ మార్కెట్‌లో షియోమీ (14 Xiaomi 14 Smartphone) సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా షియోమీ 14 మరియు షియోమీ 14 అల్ట్రా మోడళ్లను విడుదల చేసింది. ఈ ఫోన్ల ద్వారా షియోమీ తొలిసారిగా తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ షియోమీ 14 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది.

షియోమీ 14 స్మార్ట్‌ఫోన్‌ను (Xiaomi 14 sale) MI వెబ్‌సైట్, ఇతర అధికారిక స్టోర్లు మరియు రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. క్లాసిక్ వైట్‌, జాడే గ్రీన్‌, మ్యాటీ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.69,999 గా ఉంది.

Xiaomi 14 Smartphone sale news

ICICI బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు మూడు నెలల యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ను ఉచితంగా పొందవచ్చు.

షియోమీ 14 కొనుగోలుదారులు ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫోన్‌ను ఉచితంగా తనిఖీ చేయించుకోవచ్చు. దీంతోపాటు ఫోన్‌ను కేవలం రెండు గంటల్లోగా రిపేర్‌ చేసి ఇవ్వనున్నారు లేదా మీ షియోమీ 14 తిరిగి ఇచ్చేంత వరకు మరోఫోన్‌ను మీకు వినియోగానికి ఇస్తారు.

Xiaomi 14 Smartphone sale news

దీంతోపాటు మార్చి 11 మధ్యాహ్నం 12 గంటల తర్వాత షియోమీ 14 అల్ట్రా రిజర్వ్‌ ఎడిషన్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.9,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రిజర్వ్‌ ఎడిషన్‌ ఫోన్‌లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఏప్రిల్‌ 8 తర్వాత Mi.com, Mi Homes ద్వారా సేల్‌ ప్రారంభం అవుతుంది. అయితే షియోమీ 14 అల్ట్రా మోడల్‌ ఏప్రిల్‌ 12 నుంచి కొనుగోలు చేయవచ్చు.

షియోమీ 14 స్మార్ట్‌ఫోన్‌ 6.36 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌తో రక్షణను కలిగి ఉంది. 90W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ మరియు 10W రివర్స్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4610mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌.. అడెన్నో 750 చిప్‌సెట్‌తో జతచేయబడుతుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

షియోమీ 14 వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP లైట్‌ ఫ్యూజన్‌ 900 ప్రైమరీ కెమెరా, 50MP టెలీఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 32MP కెమెరాను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi 14 Smartphone sale is live on amazon Flipkart and official website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X