50MP ట్రిపుల్ కెమెరాలతో షియోమీ 14 స్మార్ట్‌ఫోన్.. HyperOS సహా కీలక స్పెసిఫికేషన్లు..!
షియోమీ సంస్థ భారత్ మార్కెట్‌లో షియోమీ 14 స్మార్ట్ ఫోన్‌ను (Xiaomi 14 Smartphone Launch) విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇటీవల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్‌లో ఆవిష్కరించింది. భారత్‌లో మార్చి 7 సాయంత్రం 5 గంటలకు ఈ షియోమీ 14 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. విడుదల కార్యక్రమాన్ని సంస్థ అధికారిక యూట్యూబ్ మరియు సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా లైవ్ చూడొచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఉందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో ఎంత ధరకు కొనుగోలు చేయవచ్చనే వివరాలను షియోమీ సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారుగా 75,000 రూపాయలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు రేపు విడుదల సమయంలో వెల్లడి కానున్నాయి.

షియోమీ 14 స్పెసిఫికేషన్లు :
షియోమీ 14 స్మార్ట్ ఫోన్ 1.5 రిజల్యూషన్‌తో 6.36 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్ సహా 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ HyperOS పైన పనిచేస్తుంది. భారత్ మార్కెట్లో ఈ OSను కలిగి ఉన్న తొలి స్మార్ట్ ఫోన్ షియోమీ 14 అని సంస్థ వెల్లడించింది.
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ : దీంతోపాటు ఈ షియోమీ కొత్త హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా ఈ షియోమీ 14 స్మార్ట్ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 90W వైరడ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4,160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

50MP ట్రిపుల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా : షియోమీ 14 స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP హంటర్ 900 సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 50MP టెలీఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ షియోమీ ర్యామ్, స్టోరేజీ వేరియంట్ల వివరాలు సహా ధర, సేల్ వివరాలు రేపు విడుదల సందర్భంగా వెల్లడికానున్నాయి. అయితే చైనాలో షియోమీ 14 ప్రో, అల్ట్రా మోడళ్లు కూడా విడుదల అయ్యాయి. అయితే భారత్‌లో కేవలం షియోమీ 14 బేస్ మోడల్ మాత్రమే విడుదల కానుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








